సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్‌ షాక్‌ | Supreme Court Key Comments On Margadarsi Case | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్‌ షాక్‌

May 4 2026 12:20 PM | Updated on May 4 2026 3:04 PM

Supreme Court Key Comments On Margadarsi Case

సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్‌ షాక్‌ తగిలింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసును కొనసాగించవద్దని మార్గదర్శి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అలాగైతే రామోజీ ఆస్తులు అటాచ్ చేసి, బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో తాము ఇప్పటికే అందరికీ చెల్లింపులు చేశామని ముకుల్ రోహత్గీ చెప్పుకొచ్చారు. అనంతరం, ఆ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాగా, మార్గదర్శి కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సేకరించింది. ఈ నేపథ్యంలో రామోజీరావు చనిపోవడంతో కేసు మెయింటైనబుల్ కాదని హైకోర్టులో మార్గదర్శి వాదనలు వినిపించింది. దాంతో ఎఫ్ఐఆర్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఉండవల్లి సవాల్‌ చేశారు.

దీంతో, సుప్రీంకోర్టు.. ఆర్‌బీఐ, ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు, కిరణ్, రామోజీరావులకు నోటీసులు జారీ చేసింది. ఉండవల్లి తరఫున వాదనలు సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్, న్యాయవాదులు అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఈరోజు వాదనల తర్వాత తదుపరి విచారణను వాయిదా వేసింది. 

సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement