మేడ్‌ ఇన్‌ శ్రీకాకుళం

Students Innovations With Their Skill Made Proud Srikakulam - Sakshi

జాతీయ స్థాయికి సిక్కోలు విద్యార్థుల ప్రాజెక్టులు

జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ మనాక్‌  పోటీలకు నాలుగు ప్రాజెక్టుల ఎంపిక

విద్యార్థులపై ప్రశంసల జల్లు   

జిల్లా విద్యార్థులు తమ ఆలోచనలతో అదరగొట్టారు. జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ మనాక్‌  పోటీలకు ఎంపికై ‘మేడ్‌ ఇన్‌ సిక్కోలు’ బ్రాండ్‌కు ఊపిరి పోశారు. అమ్మాయిల కోసం ఓ స్కూలు విద్యార్థులు ఆలోచిస్తే.. అన్నదాతల కోసం మరో బడి పిల్లలు ప్రాజెక్టు తయారు చేశారు. అగ్ని ప్రమాదాలను గుర్తించడానికి ఒక పాఠశాలలో ప్రయోగాలు జరిపితే.. దివ్యాంగుల కోసం మరో స్కూలు పరికరాన్ని తయారు చేసింది. జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ మనాక్‌  పోటీలకు ఎంపిక కావడంతో విద్యార్థులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నాలుగు ప్రాజెక్టులను పరిశీలిస్తే.. 
శ్రీకాకుళం న్యూ కాలనీ,రణస్థలం, రేగిడి,
 రాజాం సిటీ, హిరమండలం  :
 
 రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ మనాక్‌ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 331 ప్రాజెక్టులు పోటీ పడ్డాయి. ఇందులో జాతీయ పోటీలకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 34 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వాటిలో శ్రీకాకుళం నుంచి ఎంపికైనవి నాలుగు ఉన్నాయి. ఈ పోటీలు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానం లేదా ఐఐటీ వేదికగా జరగనున్నాయి. తేదీలు ఇంకా ఖరా రు కాలేదు. అంతకుముందు వర్చువల్‌ విధానంలో జిల్లా స్థాయి పోటీలకు 287 ప్రాజెక్టులు వచ్చాయి. వీటి నుంచి 23 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపించారు. వాటిలో నాలుగు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి.  

‘ఫైర్‌’ ఉన్న ప్రాజెక్టు 
ప్రాజెక్టు పేరు:    ఫైర్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌ 
విద్యార్థి  :     గొర్లె ప్రణతి, 10వ తరగతి 
పాఠశాల :     జీఎంఆర్‌ వరలక్ష్మి డీఏవీ పబ్లిక్‌ స్కూల్, రాజాం 
గైడ్‌ టీచర్‌ :     ఎస్‌.కిరణ్‌కుమార్‌(ఫిజికల్‌ సైన్స్‌)  
అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా ముందుగా ప్రమాదాన్ని గుర్తించేలా ప్రణతి తన ప్రాజెక్టుకు రూ పకల్పన చేసింది. పైథాన్‌ లాంగ్వేజ్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ను డిజైన్‌ చేసి దీని ద్వారా అగ్ని ప్రమాదాలను ప సిగట్టవచ్చని వివరించింది. వెబ్‌కెమెరా ద్వారా ఒక కిలోమీటర్‌ పరిధిలో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఈ సాఫ్ట్‌వేర్‌ తన కార్యాలయంలో అందరినీ అలెర్ట్‌ చేస్తుంది. బీప్‌ సౌండ్‌తో పాటు కాంతిని కూడా అందించి హెచ్చరిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఖర్చు చాలా తక్కువ. సమయం కూడా ఆదా అవుతుంది. వెబ్‌కెమెరా, సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తే సరిపోతుందని విద్యార్థి ప్రణతి, గైడ్‌ టీచర్‌ చెబుతున్నారు. 

అన్నదాతకు వెన్నుదన్న
ప్రాజెక్టు పేరు:     రైతు మిత్ర యంత్రం 
విద్యార్థి:     పాలవలస అక్షయ్‌కుమార్‌ 
పాఠశాల :    జెడ్పీహెచ్‌స్కూల్, రేగిడి 
గైడ్‌ టీచర్‌ :     బూరవెల్లి ఉమామహేశ్వరి, బయలాజికల్‌ సైన్స్‌  
రైతులకు రానురాను సాగు ఖర్చు లు అధికమైపోతున్నాయి. వీటిని తగ్గించే క్రమంలో ఓ ప్రాజెక్టును త యారు చేశాడు రేగిడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి అక్షయ్‌కుమార్‌. కూలీల ఖర్చు లేకుండా రైతు మిత్ర యంత్రంతో మ నుషులు చేసే పనులు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ రైతు మిత్ర యంత్రంతో అన్నదాతకు చాలా ఖర్చులు ఆదా అవుతాయి. ఈ ప్రాజెక్టుకు అక్షయ్‌కుమార్‌కు జి.హరిబాబు అనే మరో విద్యార్థి సహకారం అందించాడు. ఈ యంత్రంతో రైతులు పొలం చదునుచేయడం, విత్తనాలు చల్లడం, నీరుపెట్టడం, ఎరువులు, పురుగు మందు చల్లడం, పంట చేతికి అందిన సమయంలో ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తడం, బస్తా బరువును కొలవడం, నిల్వ చేసే చోటికి వాటిని తరలించడం చేయవచ్చు. అలాగే దీన్ని నిర్మాణ రంగంలో విని యోగించువచ్చు. దీన్ని పాఠశాలలో వృధాగా పడి ఉన్న పరికరాలు, వస్తువులతో రూపొందించారు. దాతలు సహకరిస్తే దీనిని మరింత ఉన్నతంగా తయారు చేస్తామని గైడ్‌ టీచర్, విద్యార్థి చెబుతున్నారు.  
  

తలుపు తలపు
ప్రాజెక్టు పేరు: ఆటోమేటిక్‌ డోర్‌లాక్‌ సిస్టమ్‌ 
విద్యార్థి :    టి.ఢిల్లేశ్వరరావు,     9వ తరగతి 
పాఠశాల :    ప్రభుత్వ ఉన్నత పాఠశాల, 
                   హిరమండలం 
గైడ్‌ టీచర్‌ :     ఆర్‌.అరుణ (బయలాజికల్‌ సైన్స్‌) 
సాధారణంగా దివ్యాంగులను పలకరించడానికి వారి ఇంటికి వెళ్లే వారు తిరిగి వచ్చేటప్పుడు త లుపు వెయ్యరు. మళ్లీ అక్కడ వరకు వెళ్లి తలుపు వేయడం దివ్యాంగులకు చికాకు కలిగిస్తుంది. ఈ సమస్య నివారణకు హిరమండలం హైస్కూల్‌ వి ద్యార్థి ఢిల్లేశ్వరరావు ఒక ప్రాజెక్టును తయారు చే సుకున్నాడు. అదే ఆటోమేటిక్‌ డోర్‌లాక్‌ సిస్టమ్‌. మంచానికే పరిమితమైన వారిని చూసేందుకు ఎవరైనా వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌ సిస్ట మ్‌ ద్వారా తలుపు క్లోజ్‌ అవుతుంది. డోర్‌కు సర్క్యూట్‌ అమర్చాలి. రిమోట్‌లో బ్యాటరీలు వే యాలి, స్ప్రింగ్‌ సిస్టమ్‌ ద్వారా తలుపు ముందుకు, వెనక్కి తెరుచుకుంటుంది. బ్యాటరీలు మాత్రం వేయాల్సి ఉంటుంది. పక్షవాతంతో కాళ్లుచేతులు పని చేయని వారికి ఈ సిస్టమ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని తయారీకి కేవలం రూ.1000 అవసరం అవుతుందని విద్యార్థి ఢిల్లీశ్వరరావు, గైడ్‌ టీచర్‌ చెబుతున్నారు. 

పరిశుభ్రం.. సురక్షితం
ప్రాజెక్టు పేరు: అరటి పీచు నుంచి శానిటరీ ప్యాడ్స్‌ తయారీ  
విద్యార్థి:    కె.గాయత్రి, కె.సుజాత, 10వ తరగతి 
పాఠశాల:    ఏపీ మోడల్‌స్కూల్, కొండములగాం (రణస్థలం మండలం) 
గైడ్‌ టీచర్‌ పేరు:    పి.శ్రీదేవి 
             (బయలాజికల్‌ సైన్స్‌)  
ఆడ పిల్లల రుతు సమస్యల గురించి చాలా మంది ఇప్పటికీ బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ దీనిపై ఒక ప్రాజెక్టు తయారు చేసి కొండములగాం మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు గాయత్రి, సుజాతలు శభాష్‌ అనిపించుకున్నారు. అరటి పీచుతో నాణ్యమైన, మేలైన శానిటరీ ప్యాడ్స్‌ తయారు చేయవచ్చని వారు ప్రాజెక్టును రూపొందించారు. దీని తయారీ గురించి వారిలా వివరించారు. అరటి గెలలు తీశాక అరటి మెక్కలు మిగిలి ఉంటాయి. అందులో కాండం నుంచి పీచును తొలగిస్తారు. వేరుచేసిన పీచును కాటన్‌ క్లాస్‌తో కలిపి ప్యా డ్స్‌ను తయారుచేస్తారు. ఒక ప్యాడ్‌కు ఆరు గ్రా ముల పీచు అవసరం అవుతుంది. కాటన్‌ క్లాత్‌ అవసరం. ఆ కాటన్‌ క్లాత్‌తోనూ స్ట్రిచ్చింగ్‌ చే యాలి. ఇది ఈజీగా భూమిలో కలిసిపోతుంది. వేడినీటిలో ఉతికి ఒక ప్యాడ్‌ని అధిక సార్లు వినియోగించవచ్చు. ప్రకృతి నుంచి తయారుచేసిన ప్యాడ్స్‌ కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అతి తక్కువ ఖర్చు. ఒక ప్యాడ్‌ తయారు చేయడానికి కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుందని విద్యార్థినులు, గైడ్‌ టీచర్‌ చెబుతున్నారు. 

 

విద్యార్థులకు, గైడ్‌ టీచర్లకు అభినందనలు 
జిల్లా నుంచి జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనాక్‌ పోటీలకు రికార్డు స్థాయిలో నాలుగు ప్రా జెక్టులు ఎంపిక కావడం చాలా సంతోషం. అభినందనీయం. జిల్లాకు గర్వకారణం. ఉత్తమ ప్రదర్శనలు కనబర్చిన విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు శుభాకాంక్షలు. వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలి.  
– బి.లింగేశ్వరరెడ్డి, డీఈఓ శ్రీకాకుళం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top