నిలిచిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు

Stopped Private Travels‌ Buses In AP - Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో నిర్ణయం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలో 880 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా నేపథ్యంలో బస్సుల్లో 50 శాతం సీట్లతోనే నడపాలని నిబంధన విధించడంతో పాటు ప్రజలు కూడా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి కనపరచడం లేదు. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు తమంతట తాముగానే శనివారం నుంచి 880 బస్సులు తిప్పడాన్ని నిలిపేస్తున్నట్లు రవాణా శాఖకు ముందుగానే తెలియజేశారు.

కోవిడ్‌ నేపథ్యంలో బస్సులను నడపలేమని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు రవాణా శాఖకు తెలియజేశారు. రవాణా శాఖ కూడా ఈ బస్సులకు సంబంధించిన పాత పన్నులేమైనా చెల్లించాల్సి ఉంటే వాటిని వసూలు చేసింది. ముందస్తుగా రవాణా శాఖకు సమాచారం ఇవ్వడంతో ఆ తిప్పని కాలానికి బస్సులకు పన్ను నుంచి మినహాయింపు పొందడానికి వీలుంటుందని రవాణా శాఖ అధికార వర్గాలు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top