‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం’ | Sri Ranganatha Raju on YSR Jagananna Colonies | Sakshi
Sakshi News home page

‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం’

Jun 16 2021 1:48 PM | Updated on Jun 16 2021 4:46 PM

Sri Ranganatha Raju on YSR Jagananna Colonies  - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి బుధవారం సమీక్ష​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సాఆర్‌ జగనన్న కాలనీలను .. మోడల్‌ కాలనీలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా,  ఏపీలో రూ.33 వేల కోట్లతో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

అయితే, ఈపథకంలో అర్హులై ఉండి కూడా.. ఇంటిపట్టా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీలోని ప్రతి గ్రామంలో పార్టీల కతీతంగా,  ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

చదవండి: ‘‘స్పందన"పై కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement