సేంద్రీయ సాగు కోసం ప్రత్యేక పాలసీ | Special policy for organic farming | Sakshi
Sakshi News home page

సేంద్రీయ సాగు కోసం ప్రత్యేక పాలసీ

Feb 17 2021 4:56 AM | Updated on Feb 17 2021 4:56 AM

Special policy for organic farming - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు వ్యవసాయ–పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేంద్రీయ సాగులో ఉత్తమ పద్ధతులను తీసుకురావాలని సంకల్పించింది. ఇందుకోసం ఆర్గానిగ్‌ ఫార్మింగ్‌ పాలసీని తీసుకురానుంది. ఈ పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీలో చైర్మన్‌గా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవహరిస్తారు. మరో 17 మందిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ రాష్ట్రంలో సేంద్రీయ సాగు స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై డ్రాఫ్ట్‌ పాలసీని రూపొందించేందుకు అధ్యయనం చేసి 30 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement