
విజయవాడ: ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక జెండా ఆకర్షణగా నిలిచింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేశారు. ప్రత్యేక వాహనంలో ఉంచిన జాతీయ జెండాను అగ్ని మాపక, పోలీస్ సిబ్బంది ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్న వేడుకల్లో ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.