నెల్లూరు: కత్తులతో యువకుల హల్‌చల్‌! | Short Film Troop Hulchal In Nellore Muthukur Gate | Sakshi
Sakshi News home page

నెల్లూరులో షార్ట్‌ ఫిల్మ్‌ ట్రూప్‌ హల్‌చల్‌

Nov 21 2020 5:07 PM | Updated on Nov 21 2020 5:14 PM

Short Film Troop Hulchal In Nellore Muthukur Gate - Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరులో ఓ షార్ట్ ఫిల్మ్ ట్రూప్ హల్‌చల్‌ చేసింది. కొంతమంది యువకులు కత్తులతో బైక్‌పై చక్కర్లు కొడుతూ స్థానికులను బెంబేలెత్తించారు. షూటింగ్‌ను నిజమైన గొడవేమోనని భావించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ముత్తుకూరు గేటు వద్దకు చేరుకున్నారు. షార్ట్‌ఫిల్మ్‌ షూట్‌కు అనుమతి లేదంటూ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము కార్పొరేషన్‌ వద్ద పర్మిషన్‌ తీసుకున్నామని చెప్పడంతో మందలించి వదిలేశారు.

Advertisement
 
Advertisement
Advertisement