అసలు ఇసుక లారీ ప్రమాదమే జరగలేదు

Sand truck accident never happened says Kaneti Vijaykumar - Sakshi

బైక్‌ బోల్తా కొట్టి ప్రమాదం జరిగింది

మాజీ ఎంపీ హర్షకుమార్‌ దీన్ని రాజకీయం చేస్తున్నారు

స్పృహలోకి వచ్చిన కానేటి విజయకుమార్‌ వెల్లడి

మలుపు తిరిగిన శిరోముండనం ఘటన

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిలో దళిత యువకుడు ఇండుగుపల్లి ప్రసాద్‌ శిరోముండనం ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆ రోజు ఇసుక లారీ ఢీకొట్టడం వల్ల తనకు గాయాలవడంతో వివాదం తలెత్తినట్టుగా ప్రసాద్‌ చెబుతున్నది వాస్తవం కాదని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రోజు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో దళిత యువకుడు కానేటి విజయకుమార్‌ శనివారం స్పృహలోకి వచ్చి స్పష్టం చేశాడు. ఇంకా అతడు ఏం చెప్పాడంటే.. (హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో)

► ఈ నెల 18 రాత్రి ప్రసాద్, మరికొంతమంది మిత్రులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా బైకు బోల్తా పడి పక్కనే ఉన్న గోతిలో పడింది. దీంతో కాలు విరిగింది తప్ప లారీ ఢీకొని కాలు విరగలేదు. 
► లారీ ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే గొడవ పడినట్టు ప్రసాద్‌ చెబుతున్న దానిలో నిజం లేదు. అసలు ప్రసాద్‌ ఆ సమయంలో అక్కడ లేనే లేడు.
► ఈ ఘటనలో నా పేరును ప్రసాద్, మరికొంత మంది దళిత నాయకులు ఎందుకు వాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. 
► నిజానికి ప్రసాద్‌ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త. గత ప్రభుత్వ హయాం నుంచే ఇసుక లారీల వద్ద వసూళ్లకు పాల్పడేవాడు. ఇవ్వని వారితో గొడవ పడుతుండేవాడు. 
► 2019, మార్చి 10న మరో ఇద్దరితో కలిసి సీతానగరం పలావ్‌ సెంటర్‌ వద్ద పలసపూడి నాగేంద్ర అనే వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో ప్రసాద్‌పై సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో 74/2019, ఐపీసీ 324 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.
► ప్రమాదం బారినపడ్డ నన్ను ఏ దళిత నాయకుడూ పరామర్శించలేదు. 
► మాజీ ఎంపీ హర్షకుమార్‌ కూడా దీన్ని రాజకీయం చేస్తుండటం నాకు బాధ కలిగిస్తోంది. (శిరోముండనం కేసు; కొత్త కోణం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top