బాబు దండగ అంటే.. జగన్‌ పండగ చేశారు..  | Sakshi
Sakshi News home page

బాబు దండగ అంటే.. జగన్‌ పండగ చేశారు.. 

Published Sat, Apr 20 2024 1:15 AM

Revolutionary changes in agriculture sector through RBKs in Jagan Govt: AP

రాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కుతున్న వ్యవసాయ రంగం 

గణనీయమైన పురోగతి.. రైతుల ఆదాయం పెరుగుదల.. జీవన ప్రమాణ స్థాయి మెరుగు  

దింపుడు కల్లం ఆశతో ఉన్న టీడీపీ కోసం ఈనాడు రోత రాతలు 

కళ్లెదుటే మార్పు కనిపిస్తున్నా ఉన్మాదిలా పేట్రేగిపోతున్న రామోజీ 

వినూత్న ఆర్బీకే వ్యవçస్థపై అంతర్జాతీయ స్థాయిలో వేనోళ్లా ప్రశంసలు 

గ్రామ స్థాయిలో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, యంత్ర, బ్యాంకింగ్‌ సేవలు 

ఈ క్రాప్‌ ద్వారా పక్కాగా పంటల నమోదు  

పైసా భారం పడకుండా పంటల బీమా 

సీజన్‌ ముగియకుండానే పంట నష్టపరిహారం 

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు సైతం చెల్లింపు 

ఎన్నికల్లో ఇచి్చన హామీకి మించి పెట్టుబడి సాయం 

ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల సాయం 

రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం.. దిగుబడులు.. 

పంటల మారి్పడితో పెరిగిన ఉద్యాన పంటల సాగు 

పండ్ల సాగు, దిగుబడులు, ఎగుమతులు ఘనం 

ఆక్వా రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం 

మత్స్యకారులకు వెన్నుదన్నుగా సంక్షేమ ఫలాలు 

జగనన్న పాల వెల్లువతో పాడి రైతులకు భరోసా 

అనుబంధ రంగాలకూ ఊతం..

ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు 

ఇక వ్యవసాయం దండగ.. దాని పని అయిపోయింది.. రైతులు వేరే పనులు చూసుకోండి.. వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ అట! సాధ్యమయ్యే పనేనా? కరంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయి’. ఈ మాటలు అన్నది ఎవరని తెలుగు ప్రజలు ఎవరిని అడిగినా ‘చంద్రబాబునాయుడు’ అని టక్కున సమాధానమిస్తారు. రైతులంటే ఆయనకు చులకన. వ్యవసాయం అంటే దరిద్రం అని భావన. విద్యుత్‌ చార్జీలు తగ్గించమని అడిగినందుకు రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర ఆయనది. 

‘ఈ దేశంలో, రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజలు ఆధారపడిన వృత్తి వ్యవసాయం. ఆరుగాలం శ్రమిస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రైతుల కష్టాలు కళ్లారా చూశాను కాబట్టే వారి కోసం ఎందాకైనా.. అంటూ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రైతులకు ప్రభుత్వాల పరంగా ఎంత చేసినా తక్కువే’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తరచూ చెబుతుంటారు.  
వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఎంత తేడా ఉందో పై రెండు ఉదాహరణలే నిదర్శనం. ఇలాంటి చంద్రబాబుకు ఈనాడు రామోజీ నిత్యం బాకా ఊదుతున్నారు. వ్యవసాయ రంగ పితామహుడు చంద్రబాబే అన్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. దింపుడు కల్లం ఆశలతో ఉన్న టీడీపీని ఎలాగైనా సరే బతికించాలని బరితెగింపు రాతలు రాస్తున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. 

ప్రపంచ స్థాయి ఆవిష్కరణ 
వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ఆలోచన వినూత్నం.ప్రపంచ స్థాయి ఆవిష్కరణ. వ్యవసాయాధారిత దేశాలన్నీ అనుసరించదగ్గ గొప్ప విధానం. వీటికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తాం. వీటి గురించి ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి కూడా నివేదించాం.
– తోమియో షిచిరీ, కంట్రీ మాజీ డైరెక్టర్, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (యూఎన్‌వో) 

జాతీయ స్థాయిలో అధ్యయనం జరగాలి  
ఆర్బీకేల ద్వారా సంక్షేమ పథకాల అమలుతో పాటు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్తున్న తీరు బాగుంది. వాటిని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు చర్చ, అధ్యయనం జరగాలి. ఆర్బీకేలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఈ విషయమై కేంద్రానికి నివేదిక ఇస్తున్నాం. -అమితాబ్‌కాంత్,సీఈవో, నీతి ఆయోగ్‌ 

రామోజీ.. కళ్లకు పచ్చగంతలు తీసి చూడు...మొత్తంగా వ్యవ‘సాయం’ రూ. 1,86,548 కోట్లు

చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు 
నిండా మునిగారు. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండగ చేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా స్థిరమైన వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. రైతుల 
ఆదాయం, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది.  – పంపాన వరప్రసాదరావు 

ధాన్యపు సిరులు..పంట ఉత్పత్తులు
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు బ్రేకయ్యాయి. బాబు హయాంలో గరిష్టంగా 2017–18లో 167.22 లక్షల టన్నుల దిగుబడులు నమోదు కాగా, గడచిన ఐదేళ్లలో 2019–20 సీజన్‌లో గరిష్టంగా 175.12 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. వ్యవసాయ శాఖ చరిత్రలోనే ఇదే గరిష్ట దిగుబడులు.. 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే, 2019–23 మధ్య 162.04 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే బాబు హయాంతో పోల్చుకుంటే 8 లక్షల టన్నులకు పైగా పెరిగింది . మరో పక్క కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల కొనుగోలు ద్వారా రైతులకు అండగా నిలిచేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.

ఇలా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్‌లో జోక్యం చేసుకొని 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7746.31 కోట్ల విలువైన 22.59 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు  కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి కేవలం రూ.3322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులను మాత్రమే సేకరించగలిగింది. ధాన్యం కొనుగోలు ద్వారా 37.73 లక్షల మంది రైతులకు రూ.65,258 కోట్లు చెల్లించారు. గ్యాప్‌ సరి్టíఫికేషన్‌తో రైతులకు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయి ధరలు లభించేలా కృషి చేస్తోంది. ఇప్పటికే 3,524 ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు గ్యాప్‌ సరి్టఫికేషన్‌ ద్వారా 1673 మంది రైతులు లబ్ధి పొందారు. 

ఆర్బీకేలు.. ఆదర్శం 
ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. ఇవి ప్రతి రైతును గ్రామస్థాయిలో చేయిపట్టి నడిపిస్తున్నాయి. గ్రామల్లో ఏర్పాటైన 10,778 ఆర్బీకేలను వన్‌ స్టాప్‌ సెంటర్స్, నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దారు. వీటిలో 16 వేల మందికి పైగా పట్టభద్రులతోపాటు అనుభవజు్ఞలైన ఎంపీఏవోలు, గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. ఇక్కడ స్మార్ట్‌ టీవీ, డిజిటల్‌ లైబ్రరీ, సీడ్, సాయిల్‌ టెస్టింగ్‌ కిట్స్, కియోస్‌్కలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా బుక్‌ చేసుకున్న 24 గంటల్లోనే సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. మెరుగైన సేవల కోసం ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్, బ్యాంకింగ్‌ సేవల కోసం 9,277 బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను అనుసంధానించారు.

ఈ క్రాప్‌ ప్రామాణికంగా ధాన్యంతో సహా పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం, వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలను అర్హులైన రైతులకు అందిస్తున్నారు. యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు గోదాములు, కోల్డ్‌ రూమ్స్, కలెక్షన్‌ సెంటర్స్‌ వంటి మౌలిక వసతుల కల్పనతో బహుళ ప్రాయోజిత కేంద్రాలు (ఎంపీఎఫ్‌సీ) లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది.

పొరుగు రాష్ట్రాలతో పాటు ఇథియోపియా, వియత్నాం వంటి దేశాలు ఈ తరహా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో), నీతి ఆయోగ్, ఐసీఎఆర్, నాబార్డు, ఆర్బీఐ ఇలా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఆర్బీకేలను సందర్శించి వీటి సేవలను కొనియాడారు. 

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌  
వైఎస్సార్‌ రైతు భరోసా పథకం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎన్నికల్లో ఇచి్చన హామీ కంటే మిన్నగా ఏటా 3 విడతల్లో ఒక్కో విడతకు రూ.13,500 చొప్పున 2019 నుంచి ఇప్పటివరకు 1.65 లక్షల కౌలు రైతులు, 94 వేల అటవీ భూ సాగు రైతులతో సహా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి 4 విడతల్లో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉండగా, 5 విడతల్లో రూ.67,500  సాయం అందించారు. నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన రైతులకు యూనివర్శల్‌ బీమా కవరేజ్‌ కల్పిస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.

గత ప్రభుత్వ హయాంలో కేవలం 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం అందిస్తే ఈ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల చొప్పున రెట్టింపు పరిహారం అందింది. 19 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఎలాంటి కోతలు లేకుండా రోజువారీగా 9 గంటల నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. ఈ ఐదేళ్లలో విద్యుత్‌ సబ్సిడీ రూపంలో రూ.37,374 కోట్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చు చేసింది. 

సీజన్‌ ముగిసేలోపే పంట నష్ట పరిహారం 
► ఈ ప్రభుత్వంలో ఏ సీజన్‌లో పంట నష్టానికి ఆ సీజన్‌లోనే పరిహారం అందజేత.  
​​​​​​​►ఇందుకోసం రూ.2వేల కోట్ల ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు. 
​​​​​​​►తిత్లీ తుఫాన్‌ సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారం అందజేత  
​​​​​​​►ఈ ఐదేళ్లలో 34.41లక్షల మంది రైతులకు రూ.3261.60 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేత  

►39.07లక్షల మంది రైతులకు బాబు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్లు అందజేత   
​​​​​​​►ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతులకు రూ.2050.53 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందజేత    
​​​​​​​►2019 నుంచి ఇప్పటి వరకు 801 మంది భూ యజమానులు, 495 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మందితో కలిపి మొత్తం 1,770 మందికి రూ.114.42 కోట్ల పరిహారం జమ 

పాడి రైతులకు వెన్నుదన్నుగా.. 
మూగజీవాల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట వేస్తూ రూ.240.69 కోట్లతో నియోజకవర్గానికి 2 చొప్పున 340 వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవారథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1962తో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ వాహనాలæ ద్వారా 8.81లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించగలిగారు. ఆర్బీకేల్లో నియమించిన 6548 పశుసంవర్ధక సహాయకుల ద్వారా పాడి రైతుల ముంగిట నాణ్యమైన పశువైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు లీటర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా లబ్ధి పొందేలా చేశారు.

ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 16.72 కోట్ల లీటర్ల పాలను సేకరించగా, రూ.762.88 కోట్లు చెల్లించారు. 40 నెలల్లో ఏడుసార్లు అమూల్‌ పాల ధరలను పెంచడంతో, ఆమేరకు ప్రైవేటు డెయిరీలు కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాటికి పాలు పోసే రైతులు రూ.4911 కోట్ల మేర లబ్ధి పొందగలిగారు. చేయూత, ఆసరా లబ్ధి్దదారులకు జగనన్న పాల వెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా 5.15 లక్షల కుటుంబాలకు రుణాలు సమకూర్చడం ద్వారా 3.81 లక్షల పాడిగేదెలు, ఆవులు, 1.35లక్షల మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. మరో పక్క రూ.385 కోట్ల పెట్టుబడితో మూతపడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. 

ఆక్వా రైతులకు అడుగడుగునా అండగా.. 
మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచింది. ప్రతీ కౌంట్‌కు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రతీ రైతుకు దక్కేలా కృషి చేస్తోంది. పెంచిన ఫీడ్‌ ధరలను మూడుసార్లు ఉపసంహరించుకునేలా చేసింది. ఆక్వా జోన్‌ పరిధిలోని 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో రొయ్యల ఉత్పత్తితో పాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. బాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74లక్షల టన్నులు పెరిగితే. ఈ ప్రభుత్వ హయాంలో 6.94లక్షల టన్నులు పెరిగింది.

ఎగుమతులు కూడా 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నులు జరిగితే. ప్రస్తుతం రూ.20వేల కోట్ల విలువైన 3.30లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులవుతున్నాయి. స్థానిక వినియోగం పెంచేందుకు జిల్లా స్థాయిలో ఆక్వా హబ్‌లు, 4వేలకుపైగా అవుట్‌లెట్స్‌తో పాటు డెయిలీ, సూపర్, లాంజ్‌ యూనిట్లు ఏర్పాటు చేసింది. ఈ దశలో దేశంలోనే తొలిసారి ఆక్వా రైతులకు బీమా సదుపాయం కలి్పంచింది. వరుసగా రెండుసార్లు రాష్ట్రానికి బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌ అవార్డులు దక్కాయి. మరో పక్క మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాదు..ఈ ఐదేళ్లలో ఏటా సగటున 1.16 లక్షల మందికి రూ.538 కోట్ల మత్స్యకార భృతిని అందించారు. డీజిల్‌ ఆయిల్‌ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9లకు పెంచడం ద్వారా ఈ ఐదేళ్లలో రూ.148 కోట్ల సబ్సిడీని అందించింది. 

మౌలిక వసతులతో మెరుగైన సేవలు
​​​​​​​► టీడీపీ ఐదేళ్లలో 4.99 లక్షల మంది రైతులకు కేవలం రూ.1488.20 కోట్ల విలువైన యంత్ర పరికరాలు అందించింది.   
​​​​​​​► ఈ ఐదేళ్లలో రూ.1052.42 కోట్లతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్‌ స్థాయిలోనూ వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు. 
​​​​​​​► వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.366.25 కోట్లు సబ్సిడీ అందించింది.  
​​​​​​​► 6362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్‌ హార్వెస్టర్స్, 31,356 ఇతర యంత్ర పరికరాలు అందజేత  

​​​​​​​► ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1584.61 కోట్లతో 500 టన్నులు, 1000 టన్నుల సామర్థ్యంతో గోదాములతో కూడిన 2536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు  
​​​​​​​► అందుబాబులోకి వచ్చిన గోదాములు – 554  
​​​​​​​►వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివి«ధ రకాల మౌలిక సదుపాయాల కల్పన.  
​​​​​​​► 60 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.19.95 లక్షల అంచనాతో 97 ఆర్బీకేల వద్ద వే బ్రిడ్జ్‌ల నిర్మాణం  
​​​​​​​► రూ.210 కోట్లతో 147 నియోజకవర్గ, 10 జిల్లా స్థాయి, 4 రీజనల్‌ స్థాయి ల్యాబ్స్‌తో పాటు డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో గుంటూరులో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటు  
​​​​​​​► అందుబాటులోకి వచి్చన జిల్లా స్థాయి ల్యాబ్స్‌ – 127  
​​​​​​​► మరో 154 వెటర్నరీ, 35 ఆక్వా ల్యాబ్స్‌ అందుబాటులోకి  

ఉద్యాన పంటల హబ్‌గా ఏపీ 
​​​​​​​​​​​​​​► 2018–19లో సాగవుతున్న ఉద్యాన పంటలు 42.5 లక్షల ఎకరాలు  
​​​​​​​​​​​​​​► ప్రభుత్వ ప్రోత్సాహంతో 2022–23 నాటికి ఏకంగా 45.61 లక్షల ఎకరాలకు పెరుగుదల  
​​​​​​​​​​​​​​► 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు  
​​​​​​​​​​​​​​► 2022–23 నాటికి ఏకంగా 368.89 లక్షల టన్నులు  
​​​​​​​​​​​​​​► దీంతో సాగులో 15 శాతం, దిగుబడుల్లో 20.9 శాతం వద్ధి రేటు సాధన  

► బాబు హయాంలో జరిగిన అరటి ఎగుమతులు – 24వేల టన్నులు  
​​​​​​​​​​​​​​► కాగా ఈ 5ఏళ్లలో జరిగిన అరటి ఎగుమతులు– ఏకంగా 1.75లక్షల టన్నులు  
​​​​​​​​​​​​​​► అరటి ఎగుమతుల కోసం తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేకంగా కిసాన్‌ రైళ్లు ఏర్పాటు  
​​​​​​​​​​​​​​► గతంలో మిరప ఎగుమతి – 12లక్షల టన్నులు  
​​​​​​​​​​​​​​►  ప్రస్తుతం జరిగిన మిరప ఎగుమతి – 16 లక్షల టన్నులు   

​​​​​​​​​​​​​​► గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిందు, తుంపర పరికరాలకు ఈ ప్రభుత్వం చెల్లించిన నిధులు రూ. 800.16 కోట్లు  
​​​​​​​​​​​​​​► ఈ ఐదేళ్లలో సబ్సిడీ రూపంలో చెల్లించిన నిధులు – రూ.2669.65 కోట్లు  
​​​​​​​​​​​​​​► తద్వారా కొత్తగా సాగులోకి తీసుకొచి్చన ఎకరాలు – 7.33లక్షల ఎకరాలు   
​​​​​​​​​​​​​​► దీనివల్ల లబ్ధి పొందిన రైతులు 2.60లక్షల మంది

రామోజీవి దుర్మార్గపు రాతలే..
వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ, ఆర్బీకేలు, ఇతర విప్లవాత్మక కార్యక్రమాలేవీ రామోజీ కళ్లకు కనిపించడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులను గుర్తిస్తే.. ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని బాబు విస్మరించారు. ఆ బకాయిలు సహా.. పరిహారం పెంచి ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దే. ఇది కూడా తనకు కనిపించనట్లు రామోజీ నటిస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి వ్యవసాయ రంగ నిపుణులు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రగతిని ప్రశంసించడం కూడా విస్మరించి దుర్మార్గపు రాతలు రాస్తుండటం రామోజీకే చెల్లింది.

ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. 10,778 ఆర్బీకేలు, వన్‌ స్టాప్‌ సెంటర్స్, నాలెడ్జ్‌ హబ్‌లు.. ప్రతి రైతును గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపిస్తున్నాయి. 16 వేల మందికి పైగా పట్టభద్రులతోపాటు అనుభవజు్ఞలైన ఎంపీఏవోలు, గోపాలమిత్రలు అన్నదాతలకు సేవలందిస్తున్నారు. స్మార్ట్‌ టీవీ, డిజిటల్‌ లైబ్రరీ, సీడ్, సాయిల్‌ టెస్టింగ్‌ కిట్స్, కియోస్‌్కల ద్వారా సత్వర సేవలు అందుతున్నాయి. సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు.. చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో ఓ వలంటీర్, 9,277 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను అనుసంధానించారు. ఆర్బీకే ఛానల్, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది. 

ఏపీలో తగ్గిన ఆత్మహత్యలు :  కేంద్రమంత్రి ప్రకటన 
మూడేళ్లుగా ఏపీలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు. కానీ చావులతో రాజకీయాలు చేయడం రామోజీ, చంద్రబాబు ద్వయానికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడైనా ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య తక్కువగా ఉందంటే ఎవరైనా హర్షిస్తారు. కానీ దుష్టచతుష్టయం మాత్రం లోలోన కుళ్లిపోతుంటారు. ఒక పక్క రైతులను అన్ని విధాలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల కోసం అర క్షణం కూడా ఆలోచించకుండా అండగా నిలుస్తోంది. 

చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులు టీడీపీ సానుభూతిపరులా? కాదా? అనేకోణంలో చూసేవారు. తమ పార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ ఇందులో రూ.1.50 లక్షలు అప్పులకు జమ చేసి మిగిలిన రూ. 3.50 లక్షలు విత్‌డ్రా చేసేందుకు వీలు లేకుండా డిపాజిట్‌ చేసేవారు. దానిపై వచ్చే వడ్డీ మాత్రమే వాడుకునే పరిస్థితి కలి్పంచేవారు. చాలా కాలం తర్వాత ఆ డబ్బును విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇలా టీడీపీ ఐదేళ్లలో 2014–18 మధ్య 648 మంది భూ యజమానులు, 276 మంది కౌలురైతులు ఆత్మహత్యకు పాల్పడితే కేవలం 450 మంది రైతు కుటుంబాలకు మాత్రమే రూ.5 లక్షల చొప్పున రూ.22.50 కోట్లు అందించారు. 

రూ.7లక్షల పరిహారం ఇస్తున్నఏకైక ప్రభుత్వం 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. భూ యజమాని, కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడితే ఒక్క ఏపీలోనే రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది.  ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతులకు ఎలాంటి బీమా పరిహారం, ఆర్థిక సహాయం అందజేసే పరిస్థితులు లేవు. రాజకీయాలకు అతీతంగా బాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పేర్లను పునః పరిశీలన చేసి తిరస్కరణకు గురైన మరో 474 మందికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.23.70 కోట్ల ఆర్థికసాయం అందించింది.  అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు 801 మంది భూ యజమానులు, 495 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మందితో కలిసి మొత్తం 1,770 మందికి రూ.114.42 కోట్ల పరిహారాన్ని జమ చేసింది.  

దేశం మొత్తం ఏపీని చూస్తోంది.. 
మాది తమిళనాడు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యధిక అగ్రి ల్యాబ్స్‌(33) మా రాష్ట్రంలోనే ఉన్నాయనుకునే వాడ్ని. కానీ ఏపీలో ఏకంగా 160 ల్యాబ్స్‌ను తక్కువ సమయంలో నాణ్యతతో ఏర్పాటు చేశారు. ఇక్కడి ల్యాబ్స్, సాగు ఉత్పాదకాలను నేరుగా రైతులకందించాలన్న ఆలోచనతో తీసుకొచి్చన ‘రైతు భరోసా కేంద్రాలు’ గొప్ప ప్రయోగం. గ్రామ స్థాయిలో రైతులకు ఇంతలా సేవలందిస్తున్న రాష్ట్రం భారతదేశంలో మరొకటి లేదు.  – డాక్టర్‌ కె.పొన్ను స్వామి, జాయింట్‌ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ నూనెగింజల అభివృద్ధి సంస్థ  

ఈ క్రాప్‌ విప్లవాత్మక మార్పు  
ఏళ్ల తరబడి రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర పొందగలగడమనే ప్రధాన సమస్యకు ఎలక్ట్రానిక్‌ క్రాపింగ్‌ (పంటల నమోదు) ద్వారా శాస్త్రీయ పరిష్కారాన్ని ఏపీ ప్రభుత్వం చూపించింది. రైతులు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో ఈ క్రాప్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. పంటల వారీ దిగుబడి అంచనాలతో ఏయే పంట ఉత్పత్తులు ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తాయో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటుంది. ఏ పంట ఉత్పత్తులకు ఎక్కడ డిమాండ్‌ ఉంటుందో ఆయా మార్కెట్లను అనుసంధానిస్తే ప్రతీ రైతుకు మద్దతు ధర దక్కుతుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం గొప్ప విషయం. – ప్రొఫెసర్‌ విజయ్‌ పాల్‌ శర్మ, చైర్మన్, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ 

Advertisement
 
Advertisement