వచ్చే రెండు రోజులు వర్షాలు | Rains expected over the next two days | Sakshi
Sakshi News home page

వచ్చే రెండు రోజులు వర్షాలు

Mar 21 2026 4:33 AM | Updated on Mar 21 2026 4:33 AM

Rains expected over the next two days

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాను­న్న రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలి­పింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆదివారం కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement