అక్కడైతే తొక్కిసలాటకు ఆస్కారం ఉండదు.. ఇరుకుగా ఉన్న రోడ్‌లోకి వెళ్లారు: ఎస్పీ

PSR Nellore District SP VIjaya rao In Kandukur Incident - Sakshi

నెల్లూరు: జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌షోలో చోటు చేసుకున్న విషాద సంఘటనపై జిల్లా ఎస్పీ విజయరావు విచారం వ్యక్తం చేశారు. సాక్షి టీవీతో ఎస్పీ మాట్లాడుతూ.. ‘కందుకూరు సంఘటన దురదృష్టకరం. ఎన్టీఆర్ సర్కిల్‌లో చంద్రబాబు సభ ఏర్పాటు చేసేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు.

ఆ ప్రాంతంలో అయితే తొక్కిసలాటకు ఆస్కారం ఉండదు. అనుమతి ఇచ్చిన ప్రాంతాన్ని దాటి ఇరుకుగా ఉన్న రోడ్‌లోకి చంద్రబాబు వెళ్లారు. 46 మీటర్లు ముందుకు వెళ్లిపోయారు. ఒకే చోటికి జనం ఒక్కసారిగా చేరటంతో తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ పిచ్చయ్య ఇచ్చిన ఫిర్మాదుతో కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి సెక్షన్లు నమోదు చేస్తాం’ అని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top