ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం  | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం 

Published Fri, Jun 23 2023 2:39 AM

A private travel bus caught fire - Sakshi

జరుగుమల్లి (సింగరాయకొండ): అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ కిందికి దిగేశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం అర్ధరాత్రి సు­మారు ఒంటిగంట సమయంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలో హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌కు చెందిన మోజో ట్రావెల్స్‌ బస్సు(స్లీపర్‌) 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి పాండిచ్చేరి వెళుతోంది. బస్సు వెనుక భాగంలో ఉన్న సిగ్నల్‌ లైట్స్‌కు విద్యుత్‌ సరఫరా చేసే వైర్లు, ఏసీ కేబుల్స్‌ కలిసి ఉండటంతో షార్ట్‌ సర్క్యూటై మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ లక్ష్మణ్‌.. వెంటనే బస్సును రోడ్డు మార్జిన్‌లో ఆపివేశాడు. ప్రయాణికులను కిందకు దించి మంటలపై బకెట్‌తో నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేశా డు.

అయినప్పటికీ మంటలు తగ్గకపోగా, కాసేపట్లోనే బస్సు మొత్తం వ్యాí­³ంచా­యి. అప్పటికే ప్రయాణికులంతా కిందకు దిగడంతో ప్రాణాపా­యం తప్పింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌తో అక్కడకు చేరుకుని మం­ట­ల­నార్పారు. అయితే బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికుల లగేజీ మొ­త్తం కాలిపోయింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కట్టుబట్టలతో మిగిలిన ప్రయాణికులను ఇతర వాహనాల్లో ఎక్కించి గమ్యస్థానాలకు చే­­ర్చా­రు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సీఐ రంగనాథ్‌ తెలిపారు.

 
Advertisement
 
Advertisement