
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన కొమ్మినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన.. సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం కొమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. 'దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి పైకి వచ్చాను. నాపట్ల గౌరవంతో ప్రెస్ అకాడమీ ఛైర్మెన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. జగన్ రాజకీయాల్లో సీఎంగా, ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించారు. నాకు అప్పగించిన బాధ్యతలపట్ల చిత్తశుద్ధితో ప్రెస్ అకాడమీ అభివృద్ధికి కృషి చేస్తాను' అని కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
చదవండి: (ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. విగ్రహం మార్పుపై వైవీయూ వీసీ క్లారిటీ)