చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ఇలా..! | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ఇలా..!

Published Fri, May 10 2024 10:27 AM

Potula Sunita Comments On TDP Leader Chandrababu

అందుకే మహిళలపై టీడీపీ దాడులు

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం

అధ్యక్షురాలు పోతుల సునీత

దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోండి

ఈసీకి ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వెంకటలక్ష్మి లేఖ

సాక్షి, అమరావతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దళిత మహిళ అయిన హోంమంత్రి తానేటి వని తపై దాడులకు దిగటం సిగ్గుచేటని అన్నారు.

విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు పా ల్పడ్డారని, మాచర్ల నియోజకవర్గంలోని శిరి గిరిపాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమపై దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. 

హోంమంత్రి తానేటి వనితపై దాడిని మహిళా లో కం సీరియస్‌గా తీసుకుందని, మహిళలంతా ఏకమై ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చె ప్పేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించటం ఖాయమని పోతుల సునీత చెప్పారు.

మహిళలపై టీడీపీ దాడులు దుర్మార్గం..
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మహిళలపై టీడీపీ కూటమి నేతలు దుర్మార్గంగా దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల మహిళలపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలమీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆమె గురువారం లేఖ రా శారు.

ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లా­డుతూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత­పై దాడికి ప్రయత్నించడంతో దళితులు, మహిళలు భ యాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు.  విజయవాడలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా కుమారుడు మహిళలపై దాడి చేయడం దారుణమన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలి­నేని శ్రీనివాసరెడ్డి కోడలిపై, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ నేతలు దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement