
చిత్తూరు జిల్లా: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడి కేసుకు సంబంధించి బంగారుపాళ్యం పోలీసులు ఓవరాక్షన్ చేస్తన్నారు. ఈఈ కేసుకు సంబంధించి జీడినెల్లూరు నియోజకవర్గంకు చెందిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరచకుండా, స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వేధిస్తన్నారు.
స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో స్టేషన్‌లోనే వారిని ఉంచి వేధింపులకు గురిచేస్తన్నారు. మరొకవైపు వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అరెస్ట్లు చేసిన 24 గంటల్లో కోర్టుకు హాజరు పరచాల్సి ఉన్నా, నాన్ బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు .పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ దాడి కేసులో మరికొంతమంది వైఎస్సార్‌సీపీ నాయకుల్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు.