3 రాజధానులకు మద్దతు: కానిస్టేబుల్‌ రాజీనామా

Police Constable Resign Job To Support AP Three Capital Decision - Sakshi

సాక్షి, విజయవాడ: మూడు రాజధానుల వ్యవస్థతో ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణకు ఉద్దేశించిన మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ పోలీస్‌ కానిస్టేబుల్‌ బసవరావ్‌ రాజీనామా చేశారు.

అమరావతి పేరుతో ఆనాటి సీఎం చంద్రబాబు భూములను బలవంతంగా లాక్కొన్నందుకు నిరసనగా.. పదేళ్ల సర్వీసును వదులుకున్నారు. మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరావ్‌.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని  హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. (చదవండి: మూడు రాజధానులకు రాజముద్ర)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top