శ్రీవారి ఆలయంలో విష సర్పం...

పశ్చిమ గోదావరి: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో పొడ పాము పిల్ల భక్తులను, దేవస్థాన సిబ్బందిని హడలెత్తించింది. సోమవారం ఈ పాము పిల్ల ఆలయ పడమర రాజగోపుర ద్వారం తలుపులో చుట్టుకుని, పడుకుని ఉండడాన్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అదే సమయంలో అటుగా వచ్చిన భక్తులు దాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దానిని బయటికి తీసి చంపేశారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ పాము పిల్ల ఇక్కడికి వచ్చి ఉంటుందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.