పుడమి సాక్షిగా.. పచ్చదనమే లక్ష్యం

Planting program under the auspices of Sakshi Media Group

సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం, అవగాహన ర్యాలీ

విజయవాడ, చంద్రగిరి నియోజకవర్గాల్లో నిర్వహణ

పాల్గొన్న మంత్రులు వెలంపల్లి, పెద్దిరెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి

మధురానగర్‌(విజయవాడ సెంట్రల్‌)/తిరుపతి రూరల్‌: కృష్ణా జిల్లా విజయవాడ, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆదివారం సాక్షి మీడియా గ్రూప్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘పుడమి సాక్షిగా..’ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ పడవల రేవు సెంటర్‌ నుంచి మధురానగర్‌ జంక్షన్‌ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించగా, చంద్రగిరి నియోజకవర్గం వకుళాపురంలో వందలాది మంది విద్యార్థులతో మొక్కలు నాటారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చంద్రగిరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు బంగారు భవిష్యత్తని మంత్రులు చెప్పారు. భూ తాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు సాక్షి మీడియా రెండేళ్లుగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు అభినందించారు. ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో సాక్షి మీడియా గ్రూప్‌తో కలిసి.. రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, గతేడాది పుడమి సాక్షిగా కార్యక్రమం తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో 10 లక్షల మొక్కలు నాటినట్లు చెవిరెడ్డి చెప్పారు.

కార్యక్రమాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, విజయవాడ సీపీ టీకే రాణా, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు నరేంద్ర, ఎండీ రుహుల్లా,  సాక్షి డీజీఎం కేఎస్‌ అప్పన్న, కృష్ణా జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్‌ ఓ.వెంకట్రామిరెడ్డి, సాక్షి టీవీ బ్యూరో చీఫ్‌ వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్‌ ఎన్‌.సతీష్, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. చిన్నారులు స్కేటింగ్‌ చేస్తూ ర్యాలీలో ఆకర్షణగా నిలిచారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top