పెట్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ | Sakshi
Sakshi News home page

పెట్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌

Published Sun, Jun 26 2022 8:34 AM

Pet Grooming Services Establish Gradually In AP - Sakshi

సాక్షి, అమరావతి: పెంపుడు జంతువుల సౌందర్యం, ఆరోగ్య సంరక్షణలో పెట్‌ స్పాలు కొత్త ఒరవడి సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు కాస్మోపాలిటిన్‌ నగరాలకే పరిమితమైన పెట్‌ గ్రూమింగ్‌ సేవలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. విజయవాడ, గుం టూరు, విశాఖపట్నం వంటి నగరాల నుంచి వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు.. ఇంటివద్దకే గ్రూమింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.  

సైజును బట్టి ఫీజు
గతంలో ఇష్టంగా పెంచుకునే జంతువులకు ఆరో గ్యం బాగోకపోతే వెటర్నరీ ఆస్పత్రులకు పరుగెత్తే యజమానులు.. ఇప్పుడు అలాంటి సమస్యలు రా కుండా ముందస్తుగా పెట్‌ గ్రూమింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో పెట్‌ సైజును బట్టి ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి మాత్రమే అయితే రూ.500 నుంచి రూ.1,900 వరకు, నెలవారీ ప్యా కేజీ  రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు రేట్లు నిర్ణయించారు. కేవలం బొచ్చు కత్తిరించేందుకే రూ.600 నుంచి రూ.1,900 తీసుకుంటున్నారు. 

రూ.4 వేల నుంచి రూ.30 వేల ఖర్చు
దేశంలో సగటున యజమానులు ఒక్కో పెంపుడు జంతువుపై (జాతిని బట్టి) నెలకు రూ.4 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. వీటిలో షాంపూలు, కండిషనర్లు, అలంకరణ ఉత్పత్తులపై 50 శాతం ఖర్చు చేస్తుండగా మిగిలినది ఆహారం, దువ్వెనలు, బ్రష్‌లు, ట్రిమ్మింగ్‌ పరికరాల కోసం వెచ్చిస్తున్నారు. 

పెరుగుతున్న జంతు ప్రేమికులు
పెరుగుతున్న చిన్న కుటుంబాలు, రెట్టింపు ఆదా యం, జీవనశైలి మార్పులతో ప్రతి ఒక్కరు జంతువుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ప్రథమస్థానంలో శునకాలు ఉండగా తర్వాతి స్థా నంలో పిల్లులున్నాయి. అమెరికా, యూరప్‌ వంటి దేశాలకు మాత్రమే పరిమితమైన పిల్లుల పెంపకం ఇక్కడ చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. ఓ సర్వే ప్రకారం దేశంలో దాదాపు మూడుకోట్ల పెంపుడు కుక్కలున్నాయి. ఏటా ఆరులక్షల కుక్కలను దత్తత తీసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్లో ప్రతి 10 మందిలో ఆరుగురు పెంపుడు జంతువుల యజమానులుగా ఉం టున్నారు.  విజయవాడ చుట్టుపక్కల ప్రాంతా ల్లోనే 30 వేల పెంపుడు కుక్కలుండటం గమనార్హం.  

ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి
పెట్‌ గ్రూమింగ్‌ సేవలకు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది.  మాకు రాష్ట్రవ్యాప్తంగా 12 వరకు పెట్‌ కేర్‌ స్టోర్స్‌ ఉన్నాయి.  అభివృద్ధి చెందిన దేశాలు, న గరాల్లో పెట్‌ గ్రూమింగ్‌ తెలిసిన వారికి మంచి డిమాండ్‌ ఉంది. విదేశాల్లో గ్రూమింగ్‌ కోర్సు చేసేందుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది.  
– మృణాళిని, పెట్‌ కేర్‌ సెంటర్‌ యజమాని 

Advertisement
Advertisement