సీఎం జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే: పేర్ని నాని

Perni Nani Inspiring Speech About CM YS Jagan - Sakshi

సాక్షి, మచిలీపట్నం:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బందరుకు  పూర్వ వైభవం తీసుకొస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. బందరు పోర్టు నిర్మాణపనులను ప్రారంభించేందుకు సీఎం జగన్‌ మచిలీపట్నం వచ్చిన క్రమంలో భారత్‌ స్కౌట్స్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగం సభలో పేర్ని నాని ప్రసంగించారు. 

‘సీఎం జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే. బందరు అభివృద్ధికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. బందరుకు సీఎం జగన్‌ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు.నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారు.

బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం.బందరు వాసుల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు. రూ. 197 ‍కోట్ల విలువైన భూములను పేదలకు పంపిణీ చేశారు. బందరు వాసుల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు. బందరుకు మెడికల్‌ కాలేజీ తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌ది. 64 ఎకరాల్లో రూ. 550 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్నారు. ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు.బందరులో గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్‌లను నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌ది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేదలకు సెంటు భూమి ఇచ్చారా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top