దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ లోకేశ్‌కు అలవాటే.. | Sakshi
Sakshi News home page

దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ లోకేశ్‌కు అలవాటే..

Published Tue, May 21 2024 8:26 AM

NRI Dr Vasudeva Reddy Fire On US Doctor Lokesh

కోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి 

చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టు

పలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్‌ పైనా నిషేధం  

ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌  వాసుదేవరెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రముఖులపై దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌కు అలవాటని ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధా­విగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్‌ ఇటీవల గన్నవరం విమా­నాశ్రయంలో లండన్‌కు వెళుతున్న సీఎం జగన్‌ను అడ్డు­కు­నేందుకు కుట్ర పన్నారు. ఈ సందర్భంగా అతని గురించి పలు విస్తుపోయే వాస్తవాలను డాక్టర్‌ వాసు­దేవరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 

ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు మెడికల్‌ కాలేజీలో 1983లో లోకేశ్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యాడు. గ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. అప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్‌ చేయడం లోకేశ్‌కు అలవాటు. ప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజ­­మాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడు. 

ఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, అదానీ మీద వాషింగ్టన్‌  డీసీ కోర్టులో కేసులు ఫైల్‌ చేశాడు. ఇండియా నుంచి కంటై­నర్‌లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్‌ నుంచి స్పైవేర్‌ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరో­పణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించింది.  

ప్రాక్టీస్‌పైనా నిషేధం 
వైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్‌ కారకుడయ్యాడు. 2006లో వర్జీనియా బోర్డ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లోకేశ్‌ మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది. అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్‌ చేశారు. అయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలి. మేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్‌ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement