సీఎం జగన్‌కు కలిసిన పలు వర్సిటీల కొత్త వీసీలు.. | New Appointed Universities VCs Meet CM Jagan In AP | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు కలిసిన పలు వర్సిటీల కొత్త వీసీలు..

Feb 22 2023 2:21 PM | Updated on Feb 22 2023 3:34 PM

New Appointed Universities VCs Meet CM Jagan In AP - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో పలు యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్‌ ఛాన్స్‌లర్లు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 

కాగా, వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వీరంతా సీఎం జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో కడప డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా నియమితులైన బానోత్‌ ఆంజనేయ ప్రసాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రు టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ) గురజాడ, విజయనగరం వీసీ కే. వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలు వీసీ మారెడ్డి అంజిరెడ్డి ఉన్నారు. ఇక, ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఫ్రొ. కే. హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement