చెక్కు చెదరని వైఎస్సార్‌సీపీ ఓట్‌ షేర్

More Than 50 Percent Votes For YSRCP In Municipal Elections - Sakshi

మరోసారి వైఎస్సార్‌సీపీకి భారీ మెజారిటీ

సాధారణ ఎన్నికలతో పోలిస్తే భారీగా తగ్గిన టీడీపీ ఓట్‌ షేర్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ మరోసారి భారీ మెజారిటీతో రికార్డు సృష్టించింది. వైఎస్సార్‌సీపీ ఓట్‌ షేర్ చెక్కు చెదరలేదు. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓట్ షేర్‌ 52.63 శాతం కాగా, టీడీపీ 30.73 శాతం,  బీజేపీ 2.41 శాతం, జనసేన 4.67 శాతం, సీపీఐ 0.80 శాతం, సీపీఎం 0.81 శాతం, కాంగ్రెస్‌ 0.62 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ఓట్‌ షేర్‌ భారీగా తగ్గింది.

మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో..
మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ దేశంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం కార్పొరేషన్లను క్లీన్‌ స్వీప్‌ చేసి ప్రభంజనం సృష్టించింది. ‘ఫ్యాన్‌’ ప్రభంజనంతో 97.33 శాతం మున్సిపాలిటీలలో పాగా వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నవరత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలకు ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్ష పెద్దలు ఎంతగా రెచ్చగొట్టినా, కుట్రలకు తెరలేపినా.. తమ తీర్పు ఇదేనని తేల్చి చెప్పారు. అటు న్యాయ రాజధాని.. ఇటు పరిపాలనా రాజధాని.. మధ్యలో శాసన రాజధానిలోనూ విస్పష్ట తీర్పునిచ్చారు. 

2014లో అలా.. 2021లో ఇలా... 
2014లో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 939 వార్డుల్లో గెలిచింది. అప్పటి ఎన్నికల్లో 36.52 శాతం వార్డులను కైవసం చేసుకుంది. టీడీపీ 1,424 వార్డుల్లో గెలిచి 55.39 శాతం వార్డుల్లో విజయం సాధించింది. కాగా ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఏకంగా 2,265 వార్డులను కైవసం చేసుకుంది. 81.07 శాతం వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 వార్డులకే పరిమితమైంది. ఆ పార్టీ కేవలం 12.70 శాతం వార్డులతో సరిపెట్టుకుంది.
చదవండి:
మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్'‌ తుపాన్
మున్సిపల్‌ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top