మున్సిపల్‌ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్‌ 

Shock to TDP Senior Leaders In Municipal Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీనియర్లమంటూ చెప్పుకునే టీడీపీ నేతలకు మున్సిపల్‌ ఎన్నికల్లో జనం షాకిచ్చారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన పచ్చనేతలకు చెక్‌ పెట్టారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా బరిలో దిగిన నేతలను దారుణంగా ఓడించారు.  
పలాస మున్సిపాలిటీ పరిధిలో తిత్లీ పరిహారం అక్రమాలకు పాల్పడిన గోల్ల చంద్రను అక్కడి ఓటర్లు ఓడించారు. 
అదే పట్టణంలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సైన వల్లభ భార్య కవితను ప్రజలు చిత్తుగా ఓడించారు. 
పార్టీలు మారుతూ చివరికీ టీడీపీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వజ్జ బాబూరావు భార్య గంగాభవానీ ఓడిపోయారు. 
గతంలో రెండు సార్లు గెలిచిన టీడీపీ మాజీ కౌన్సిలర్‌ సవర రాంబాబుకు అక్కడి ఓటర్లు ఈ సారి ఓటమి రుచి చూపించారు.  
టీడీపీ పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా టీడీపీలో పట్టు ఉన్న మాజీ కౌన్సిలర్‌ బడ్డ నాగరాజు, లావ ణ్య దంపతులిద్దరూ ఓడిపోయారు. 
టీడీపీ సీనియర్‌ నేత శేసనపురి మోహనరావు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. గత పాలకవర్గంలో ఉన్న 12 మంది టీడీపీ కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. 
ఇచ్ఛాపురంలో టీడీపీ సీనియర్‌ నేత, గతంలో మూడు సార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన తెలుకల శ్రీనివాసరావు ఈసారి 9వ వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  
పోలింగ్‌కు ముందు నగదు పంపిణీ చేస్తూ కెమెరాకు దొరికిపోయిన టీడీపీ కార్యకర్తల విషయం తెలిసిందే. ఎవరికోసమైతే ఆరోజు నగదు పంపిణీ చేశారో ఆ అభ్యర్థి , బంగారు వ్యాపారి వెచ్చా కేశవరావు ఒక్క ఓటు తేడాతో తన సమీప ప్రత్యరి్థ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పల్లంటి మధుమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. 
పాలకొండలో టీడీపీ నేత, నగర పంచాయతీ మాజీ చైర్మన్‌ పల్లా విజయనిర్మల భర్త కొండలరావు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అదే విధంగా గతంలో టీడీపీ నుంచి వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన సిరిపురం చూడామణి కూడా ఓడిపోయింది.
చదవండి:
బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం       
మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్'‌ తుపాన్ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top