
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే తిప్పేస్వామి కుటుంబ సభ్యులు
సాక్షి, మడకశిర (సత్యసాయి జిల్లా): ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కుటుంబ సభ్యులు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి సత్యవాణి, కుమారులు డాక్టర్ స్వామి దినేష్, డాక్టర్ స్వామి రాజేష్, స్వామి మహేష్ దంపతులు ముఖ్యమంత్రిని కలిశారు.
మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణానికి రూ.214.85 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. మడకశిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.
చదవండి: (యూజీసీ కంటే అడుగు ముందే ఏపీ)