సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి | Mla Biyyapu Madhusudhan Reddy Meets Cm Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి

Published Fri, Feb 10 2023 2:25 PM | Last Updated on Fri, Feb 10 2023 3:27 PM

Mla Biyyapu Madhusudhan Reddy Meets Cm Jagan - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్‌ బోర్డు ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్‌ బాబు శుక్రవారం కలిశారు.

శ్రీకాళహస్తీశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వనించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్వామివారి తీర్ధ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసిన వేద పడింతులు.. వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 26 వరకు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


చదవండి: గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement