
గుంటూరు: అసమానతలు తలెత్తకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు లభించాలనే లక్ష్యంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా విశాఖ, అమరావతి,కర్నూలు సహా.. రాష్ట్రంలోని అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మేకతోటి సుచరిత తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి