కొద్దిసేపట్లో వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక | Meteorological Department Warns Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కొద్దిసేపట్లో వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక

Mar 21 2026 4:12 PM | Updated on Mar 21 2026 6:59 PM

Meteorological Department Warns Andhra Pradesh

సాక్షి విజయవాడ: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలతో పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి , ఏలూరు,ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.  

పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిలబడరాదని ​ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది. అదేవిధంగా వర్షం సమయంలో ​​ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం వీలైనంత తగ్గించాలని తెలిపింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్త ఎండీ ప్రకటన విడుదల చేశారు.

ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement