మీ బిడ్డను బడికి పంపే వరకు ఇక్కడే ఉంటా | MEO Sits Outside Homes Until Parents Send Failed Students to Supplementary Classes | Sakshi
Sakshi News home page

మీ బిడ్డను బడికి పంపే వరకు ఇక్కడే ఉంటా

May 16 2026 8:20 AM | Updated on May 16 2026 8:20 AM

MEO Sits Outside Homes Until Parents Send Failed Students to Supplementary Classes

తిరుపతి జిల్లా: మీ బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే ఉంటానని ఎంఈఓ రవీంద్రనాథ్‌ విద్యార్థుల తల్లిదండ్రుల తెలిపారు. మండలంలోని పల్లమాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి ప్రత్యేక తరగతుల జరుగుతున్నాయి. 32 మంది విద్యార్థులు ఫెయిల్‌ కాగా ఐదుగురు మాత్రమే సప్లమెంటరీ తరగతులకు హాజరవుతున్నారు. 

ఇది తెలుసుకున్న ఎంఈఓ రవీంద్రనాథ్‌ శుక్రవారం పల్లమాల, పార్లపల్లి, పచ్ఛాలమ్మ కాలనీలో పదో తరగతి ఫెయిల్‌ విద్యార్థులను సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు పంపించాలని ఇళ్లకు వెళ్లారు. విద్యార్థులను సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు పంపాలని ఇళ్లకు వెళ్లిన ఎంఈఓ తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. మా బిడ్డను మేము తీసుకుని వస్తాం మీరు వెళ్లండి సార్‌ అని తల్లిదండ్రులు తెలిపారు. ఎంఈఓ మీ బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే కుర్చి వేసుకుని కూర్చుంటానన్నారు. 

ఇంటి వద్ద నుంచి ఎంఈఓ కదలకపోవడంతో చివరకు తల్లిదండ్రులకు బడికి పంపారు. 12 మంది విద్యార్థులను ఎంఈఓ పాఠశాలకు తీసుకొచ్చారు. అయితే ప్రధానోపాధ్యాయురాలు చేయాల్సిన పనిని ఎంఈఓ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు విధులకు రావడం లేదని, ఆమె పట్టించుకోక పోవడంతోనే విద్యార్థులకు సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement