3 Persons Died In Today Massive Road Accident At Ongole, Details Inside - Sakshi
Sakshi News home page

ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటికి కూతవేటు దూరంలోనే.. 

Oct 14 2022 10:51 AM | Updated on Oct 14 2022 12:15 PM

Massive Road Accident At Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైస్పీడ్‌లో ఉన్న కారు.. లారీని వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, మృతులను ఒంగోలుకు చెందిన పవన్‌ కుమార్‌, శ్రీను, పరమేష్‌గా పోలీసులు గుర్తించారు.

అయితే, వీరంతా తమిళనాడులోని చెన్నైకి వెళ్లి తిరిగి వస్తుండగా ఒంగోలు సమీపంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరో ఐదు నిమిషాల్లో వారు ఇంటికి చేరుకుంటారు అన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి కూతవేటు దూరంగా ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. తెల్లవారుజాము కావడం, డ్రైవర్‌ కునుకుపాటు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఒంగోలులోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement