
సాక్షి, తాడేపల్లి: టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడంతోపాటు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం వారితో కలిసి సెల్ఫీ దిగిన హీరో విష్ణు ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ రౌండ్లు కొడుతోంది. (చదవండి: అందుకే మా నాన్నంటే అసూయ: మంచు విష్ణు)
కాగా మంచు విష్ణు ప్రస్తుతం 'మోసగాళ్లు' సినిమాతో బిజీగా ఉన్నాడు. తను నటించి, నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించాడు. విష్ణు జోడీగా రుహీ సింగ్, అతడి సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఈ సినిమా కథను ప్రారంభం నుంచి ముగింపు దాకా నరేట్ చేస్తారు వెంకటేశ్. అలాగే తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన 'ఢీ' చిత్రానికి సీక్వెల్ 'డి-డి(డబుల్ డోస్)'లోనూ కనిపించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గోపీమోహన్, కిషోర్ రచయితలు పని చేస్తున్నారు. (చదవండి: పవన్‌తో పోరాటం.. రంగంలోకి రానా!)