మేడమ్‌కు ఫోన్‌ చూపిస్తానని బైక్‌పై తుర్రుమన్నాడు

Man Escaped With New Cell Phone In Mobile Shop - Sakshi

సోమందేపల్లి: మొబైల్‌షాపులోని కొత్తసెల్‌ఫోన్‌తో ఓ అపరిచిత వ్యక్తి ఉడాయించాడు. వివరాల్లోకెళ్తే.. సోమందేపల్లిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద గల మొబైల్‌షాప్‌కు బుధవారం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. తాను పక్కనే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడినని పరిచయం చేసుకున్నాడు. తోటి మహిళా ఉపాధ్యాయురాలికి సెల్‌ఫోన్‌ కొనేందుకు వచ్చానని, వీవో కంపెనీకి చెందిన రూ.18వేలు విలువ చేసే పీస్‌ని ఎంపిక చేసుకుని, దీన్ని చూపించుకుని వస్తానన్నాడు.

కావాలంటే తన వెంట మీ సేల్స్‌మన్‌ను కూడా పంపించండి అని అనడంతో షాపు యజమాని ఈశ్వరయ్య సరేనన్నాడు. అలా సేల్స్‌మన్‌తో ద్విచక్రవాహనంపై ఉన్నతపాఠశాల వద్దకు వెళ్లాడు. అక్కడ సేల్స్‌మన్‌ కిందకు దిగగానే అపరిచిత వ్యక్తి సెల్‌ఫోన్‌తో బైక్‌పై తుర్రుమన్నాడు. బాధిత షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చదవండి: దారుణం: తల్లి, ఇద్దరు పిల్లల హత్య 
కూతురి ప్రేమ: యువకుడి కాళ్లు, చేతులు నరికి హత్య

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top