Live Updates
తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్సార్ జయంతి
రాజోలు నియోజకవర్గంలో..
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వ్యాప్తంగా వైయస్సార్ సిపి ఇంచార్జ్ పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలు
- గోగన్నమఠం గ్రామంలో వైయస్సార్ జయంతి వేడుకలలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి.. మహిళలకు చీరల పంపిణీ
వాడవాడలా మహానేత జయంతి వేడుకలు
- కృష్ణాజిల్లాలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు
- అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మండలాల్లో వాడవాడలా వేడుకలు
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి జయంతి వేడుకలు
- పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో..
- హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో బుట్ట కన్వెన్షన్ లో దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు
- వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్సార్ సంక్షేమ పథకాల లబ్దిదారులతో ఆత్మీయ సమ్మేళనం
- హాజరైనా వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షులు వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాల లబ్ధిదారులు
జగిత్యాలలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
- వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
- దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఘన నివాళి..
- వైఎస్సార్ సేవలను స్మరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- రైతులు, పేదల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయం
- వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తాం
నాయకత్వానికి వైఎస్సార్ దేశంలోనే ఒక బ్రాండ్: కన్నబాబు
- కాకినాడ రూరల్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి
- వాకలపూడి లో వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కురసాల కన్నబాబు
- ఇప్పటికీ వైఎస్సార్ తలవని ఇళ్లు ఈ తెలుగు రాష్ట్రాల్లో లేవు
- శత్రువుని కూడా ప్రేమించే తత్వం వైఎస్సార్‌ది
- సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా దేశానికే ఆదర్శంగా నిలిచారు.
- విద్య, వైద్యం ఉపాధి వంటి అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు
- రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు
- వైఎస్సార్ వారసునిగా సంక్షేమం, అభివృద్ధిలో వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేశారు
వైఎస్‌కు సీఎం రేవంత్ నివాళి
- హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘవీర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
- డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు.
- ఆయన నిరుపేదలకు అందించిన సేవలు, చూపిన సంక్షేమ బాట ఎప్పటికీ చిరస్మరణీయమని సీఎం కొనియాడారు.
కోదాడలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
- సూర్యాపేట జిల్లా: మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి
- భారీ క్రేన్‌తో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మున్సిపల్ చైర్మన్
- వైఎస్సార్ చౌరస్తా వద్ద ప్రజలకు పులిహోర పంపిణీ
- వైఎస్సార్ విగ్రహం వద్ద మేము సిద్ధం పోస్టర్లతో వైఎస్ జగన్ అభిమానుల నినాదాలు
- అధిక సంఖ్యలో పాల్గొన్న కౌన్సిలర్లు, వైఎస్సార్ అభిమానులు
సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత వైఎస్సార్‌ది: సజ్జల
- వైఎస్సార్ తెచ్చిన సంక్షేమ పథకాలు కోట్ల మంది జీవితాల్లో మార్పు తెచ్చాయి: సజ్జల రామకృష్ణారెడ్డి
- ఏ పథకం తెచ్చినా ఎంతమందికి మేలు చేకూరుతుందని ఆలోచించేవారు
- మేలు జరగటమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత వైఎస్సార్‌ది
- వైఎస్సార్ పాదయాత్రతో మనిషే మారిపోయారు
- అధికారంలో ఉన్న ప్రతిక్షణం జనం గురించే ఆలోచించారు
- అధికారం అనేది ఒక సేవ అని ఆలోచించే వారు
- తండ్రికి మించిన పట్టుదలతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు
- ఎన్నో విషమ పరీక్షలు ఎదుర్కొని జనం కోసం జగన్ నిలబడ్డారు
- తన తండ్రి కోసం చనిపోయిన వారి కోసం ఓదార్పు యాత్ర చేశారు
- ఆ కుటుంబాలకు ఆర్థికంగానూ అండగా నిలిచారు
- ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి మేలు చేసిన వ్యక్తి జగన్
- చంద్రబాబు పాలనలో ప్రజల జీవితాలు చీకటి మయంగా మారాయి
- ఆ చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ జగన్ పాలన వస్తుంది
- రాష్ట్రంలో జరుగుతున్నది దోపిడీ పాలన
- పోలీసులను అడ్డగోలుగా వాడుకుని అక్రమ కేసులు పెడుతున్నారు
- అమరావతి, అవినీతి అనే పేరు వినిపిస్తే సోషల్ మీడియాలో వీడియోలు కూడా తొలగిస్తున్నారు
- ఇంత బరితెగింపును చూసి దేశ ప్రజలు విస్తుపోతున్నారు
- ఇలాంటి విషపు పాలనకు ప్రజలు చరమగీతం పాడే టైం దగ్గర్లోనే ఉంది
హైదరాబాద్: గాంధీభవన్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు
- హైదరాబాద్: గాంధీభవన్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు
- మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్, సీనియర్ నేత కేవీపీ హాజరు
వైఎస్సార్ జయంతి సందర్భంగా ఖర్గే, రాహుల్ ట్వీట్
- వైఎస్సార్ విజనరీ లీడర్: మల్లికార్జున ఖర్గే
- ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు
- ముఖ్యంగా రైతులు, పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేశారు
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన రాజనీతిజ్ఞుడు: రాహుల్
- ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు
పెద్దిరెడ్డి నివాసంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
- సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు: పెద్దిరెడ్డి
- మావిగన్‌తో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి
- అమరావతి పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృథా
- రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం
- రాష్ట్రంలో తప్పుడు జరిగితే మౌనంగా ఉండాలా?
గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో..
- గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి
- వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
- ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నాయకుడు మహానేత వైఎస్సార్: అంబటి
- తెలుగు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు
- మహానేత వైఎస్సార్ మృతి.. తెలుగు ప్రజలకు తీరని లోటు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
- వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు
- కేక్ కట్ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
- హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలగంల్లి శ్రీనివాస్, శైలజానాథ్, మాజీ ఎంపి నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు
విజయవాడలో..
విజయవాడలో మహానేత వైఎస్సార్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పశ్చిమలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాలయం సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు.
వాడవాడలా వైఎస్సార్ జయంతి
జనహృదయ నేతను.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఆరోగ్యప్రదాతను ప్రజలు స్మరించుకున్నారు. సంక్షేమ సారథికి సలాం చేశారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడిక క్కడ కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలతో ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.


