Live Updates
AIG ఆసుపత్రికి కేసీఆర్
AIG ఆసుపత్రికి కేసీఆర్
- హైదరాబాద్: మనవడు హిమాన్షును చూసేందుకు AIG ఆసుపత్రికి కేసీఆర్
- జిమ్ చేస్తూ గాయపడిన గాయపడిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు
- AIG ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న హిమాన్షు
- ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం
- కెరమెరి నుంచి చింతలమానేపల్లి వైపు సిమెంట్ స్థంబాల లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా
- ఇద్దరు అక్కడికక్కడ మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
ఆకట్టుకుంటున్న 77 అడుగుల ధోనీ కటౌట్
- హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ 77 అడుగుల కటౌట్
- ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆకట్టుకుంటున్న 77 అడుగుల ధోనీ కటౌట్
- నందిగామ శివారు అంబారుపేటలో ధోనీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు
- ధోనీపై వీరాభిమానంతో గత కోన్నేళ్లుగా ధోనీ కటౌట్ ఏర్పాటు చేస్తున్న అభిమానులు
- చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్ లో ఉన్న ధోనీ కటౌట్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్న చెన్నై ఫ్యాన్స్
నందిగామ లో ఆకట్టుకుంటున్న 77 భారీ ధోనీ కటౌట్..
నందిగామ శివారు అంబారుపేట లో ధోనీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు..
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై సందడి చేస్తున్న మాజీ కెప్టెన్ ధోనీ 77 అడుగుల కటౌట్..
ధోనీ పై వీరాభిమానం తో గత కోన్నేళ్ళు గా భారీ ధోనీ కటౌట్ లో ఏర్పాటు చేస్తున్న… pic.twitter.com/iWCrKTNIkF— Sakshi (@SakshiNews) July 7, 2026
భద్రాచలం వద్ద స్వల్ప వరద ప్రవాహం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద ఎగువ నుంచి గోదావరికి స్వల్ప వరద ప్రవాహం
- గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు స్వల్పంగా పెరుగుతున్న వరద ఉధృతి
- భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 13.4 అడుగులు వద్ద ప్రవహిస్తుంది
- 75 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
భీమారం రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్లాంటేషన్ పనుల అడ్డగింత
మంచిర్యాల జిల్లా భీమారం రిజర్వ్ ఫారెస్ట్‌లో కొత్త ప్లాంటేషన్ పనులను అడ్డుకున్న వన సంరక్షణ సమితి సభ్యులు
1995లో నాటిన నీలగిరి ప్లాంటేషన్ లాభాల్లో తమకు రావాల్సిన 50 శాతం వాటా ఇవ్వలేదని ఆరోపణ
నీలగిరి చెట్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తంలో రూ.20 లక్షల వాటా బకాయి ఉందని సభ్యుల వెల్లడి
డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్‌ను నిలదీసిన వన సంరక్షణ సమితి సభ్యులు
పనులకు అడ్డుపడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు బెదిరించారని వీఎస్ఎస్ సభ్యుల ఆరోపణ
తమకు రావాల్సిన లాభాల వాటా అందే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టీకరణ
ఉద్యమకారుల గుర్తింపుపై మంత్రి పొన్నం
- తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ మొదలయింది
- అన్ని వర్గాల అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ప్రకటన ఉంటుంది
- కేసులు ఎత్తివేయాలి, ఆరోగ్యంపై ఎక్కువగా సూచనలు, అభిప్రాయాలు వస్తున్నాయి
- విద్యార్ధి సంఘాలు అయ్యాక, ఇతర వర్గాల అభిప్రాయం తీసుకుంటాం
- ఉద్యమకారులకు ఎప్పటిలోగా ప్రభుత్వం న్యాయం చేస్తుందో ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుంది
- సాక్షి టీవీతో మంత్రి పొన్నం ప్రభాకర్
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై సీఎం రేంవత్ సమీక్ష
- హైదరాబాద్: MCRHRDలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, MCRHRD వైస్ చైర్మన్ శాంతి కుమారి, వేతన సవరణ కమిషనర్ ఎన్. శివ శంకర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు హాజరు
3వ తరగతి విద్యార్థినిపై హెడ్ మాస్టర్ వేధింపులు
- శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం ముద్దిరెడ్డిపల్లిలో దారుణం
- 3వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన హెడ్ మాస్టర్ దేవరాజ్
- విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన అమ్మాయి
- పోలీసులు, విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు
కలకలం రేపుతున్న బాలికల మిస్సింగ్
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల పాఠశాలలో కలకలం రేపుతున్న బాలికల మిస్సింగ్
- ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు సింధు, వెంకట కావ్య అదృశ్యం
- బస్టాండ్ లో సింధును గుర్తించి తల్లితండ్రులకు సమాచారం ఇచ్చిన బంధువు
- సింధు తండ్రి ఫోన్ తో అప్రమత్తం అయిన గురుకుల సిబ్బంది
- ఎమ్మిగనూరు బస్టాండ్ లో సింధు, కర్నూలులో వెంకట కావ్య ఆచూకీ లభ్యం
- విద్యార్దినిల భద్రతపై అలసత్వం వహిస్తున్న గురుకుల సిబ్బందిపై మండిపడుతున్న విద్యార్దుల తల్లిదండ్రులు
అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
- హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష
- మొక్కజొన్న కొనుగోళ్ల పేమెంట్లు మరియు PACS లకు యూరియా సరఫరాలపై మంత్రి ఆరా
- ఆయిల్ పామ్ మొక్కల సరఫరా, డ్రిప్ పరికాల సరఫరాలో అంతరాయం ఏర్పడకూడదు: మంత్రి తుమ్మల
- ఎల్‌నినో నేపథ్యంలో తొలి ప్రత్యామ్నాయ కార్యాచరణలో భాగంగా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు జిల్లాల వారిగా అందుబాటులో ఉంచాలి: మంత్రి తుమ్మల
ముగ్గురు వ్యక్తిగత కార్యదర్శులపై వేటు
- ఢిల్లీ: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ముగ్గురు వ్యక్తిగత కార్యదర్శులపై వేటు
- పాలనాపరమైన కారణాలతో తొలగించినట్లు వెల్లడి
- ప్రైవేట్ సెక్రటరీ అమర్ సింగ్ మాతృ శాఖకు బదిలీ
- అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ సింగ్ మాతృ శాఖకు బదిలీ
- మరో అడిషనల్ సెక్రటరీ ఆయుష్ శరన్ ఉద్యోగం నుంచి తొలగింపు
చిన్నాన్నను కత్తితో నరికి చంపాడు
- ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పెరంపేటలో దారుణ హత్య
- చిన్నాన్న దుర్గారెడ్డిని కత్తితో నరికి చంపిన శ్రీనివాస్ రెడ్డి
- భూ వివాదాల కారణంగా గత కొంతకాలంగా వీరి కుటుంబాల మధ్య ఘర్షణ
- ఇరువురి మధ్య ఘర్షణతో చిన్నాన్నను కత్తితో నరికి చంపిన శ్రీనివాస్ రెడ్డి
- అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు
మూఢనమ్మకంతో ప్రాణాలు తీసుకున్న మహిళ
- పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుజ్జువాయి గ్రామంలో విషాదం
- తనకు చిల్లంగి పెట్టారనే మూఢనమ్మకంతో ప్రాణాలు తీసుకున్న సచివాలయ ఉద్యోగిని
- మూఢనమ్మకంతో మానసికంగా వేదనకు గురవుతున్న కొండగొర్రి వినీల శైలజ
- మానసిక రుగ్మతతో తనను భూతవైద్యుని దగ్గరకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులతో తరచూ మారం
- కుటుంబ సభ్యులు మానసిక వైద్యుని దగ్గరకు తీసుకెళ్లడంతో మనస్థాపంతో అఘాయిత్యం
- తన కన్నవారి ఇంట్లో బాత్రూంలో యాసీడ్ తాగిన వివాహిత
- ఆరు నెలల ముందే పసిపాపకు జన్మనిచ్చిన వినీల శైలజ
- భార్యభర్తలు ఇద్దరూ సచివాలయ ఉద్యోగులేనని వాళ్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవంటున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
విజయవాడలో వామపక్షాల నిరసన
- విజయవాడ: బీసెంట్ రోడ్డులో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
- షాపుల తొలగింపును నిరశిస్తూ భైటాయింపు
- నిరసనలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు, సీపీఎం నేత దోనేపూడి కాశీనాధ్, సీపీఐ నేత కోటేశ్వరరావు
- చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించడంపై ఆగ్రహం
- కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- షాపుల తొలగింపు ఆపాలని డిమాండ్
- హాకర్స్ కు గుర్తింపు కార్డులు రెన్యువల్ చేయాలని డిమాండ్
పోలీసుస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- కర్నూలు జిల్లా ఆస్పరి పోలీసుస్టేషన్‌లో పురుగులు ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హనుమంతురెడ్డి
- ఒక కేసు విషయంలో విచారణ పేరుతో సీఐ శ్రీనివాస్ నాయక్ టార్చర్ చేస్తున్నాడని ఆరోపణ
- సీఐ వేధింపులు తాళలేక స్టేషన్ లోనే పురుగుల మందు తాగిన హనుమంతరెడ్డి
- పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- బాధిత బంధువులు నిలదీయడంతో సహనం కోల్పోయి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించి సీఐ
- తమను దుర్భాషలు ఆడుతూ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్న బాధిత మహిళలు
- పోలీసుల ఆగడాలపై విమర్శలు వెలువెత్తుతున్నా మారని వైనంపై మండిపడుతున్న ప్రజలు
మత్స్యకారుల గల్లంతు ఘటనపై కేసు
- విశాఖపట్నం : మత్స్యకారుల గల్లంతు ఘటనపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు
- బాధిత కుటుంబాల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
రామ్మోహన్ నాయుడికి పరాభవం
- విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి పరాభవం
- నిర్వాసితులకు నష్టపరిహారం ఇంకా అందలేదని కేంద్రమంత్రి కారును అడ్డుకొని నిలదీసిన మార్క్ ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ కర్రోతు బంగారు రాజు
- సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత వ్యక్తం కావడంతో సమాధానం చెప్పలేక కొద్దిసేపు కారులోనే ఉండిపోయిన రామ్మోహన్ నాయుడు
- పోలీసుల జోక్యంతో అక్కడ నుండి వెళ్లిపోయిన మంత్రి రామ్మోహన్ నాయుడు
డెక్కన్ సిమెంట్స్‌లో ప్రమాదం, ఒకరి మృతి
- సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్స్ కార్మాగారంలో ప్రమాదం
- బెల్ట్ తెగడంతో ఉద్యోగి భూతం వెంకట్రావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
ఉరవకొండలో విద్యార్థుల ఆందోళన
- అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ధర్నా
- జూనియర్ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థుల ర్యాలీ
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
- డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన విద్యార్థులు
కనిగిరిలో రోడ్డు ప్రమాదం
- మార్కాపురం జిల్లా కనిగిరి మండలం అడ్డరోడ్డు పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం
- ఎదురెదురుగా ఢీకొన్న టిప్పర్ - డీసీఎం లారీ
- ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
- క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
వైయస్సార్ జిల్లాలో వివాహిత ఆత్మహత్య
- వైయస్సార్ జిల్లా బి కోడూరు మండలం అత్రంపేట గ్రామానికి చెందిన సిద్దు అనూష అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య
- పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- సిద్దు అనూష మృతికి భర్త, అత్త, మామలే కారణమని ఆరోపణ
- అదనపు కట్నం వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని ఆవేదన
- పోలీసులకు ఫిర్యాదు చేసినా 2 రోజుల నుంచి వారిని అరెస్టు చేయని పోలీసులు
- అరెస్ట్ చేయాలని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహంతో బంధువులు ధర్నా
నాగిరెడ్డిపల్లి ఆలయంలో చోరీ
- అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని మారెమ్మ ఆలయంలో చోరీ
- 50 తులాల వెండి, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బ్రహ్మసముద్రం పోలీసులు
విజయవాడలో మునిసిపల్ కార్మికుల మహా ధర్నా
- విజయవాడలో మునిసిపల్ కార్మికుల మహా ధర్నా
- భారీగా చేరుకున్న మునిసిపల్ కార్మికులు
- కాంట్రాక్ట్ ఆప్కాస్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి
- సమాన పనికి సమాన వేతనవ్వాలి
- మున్సిపాలిటీలో ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్
- భారీగా మోహరించిన పోలీసులు


