Breadcrumb
- HOME
Live Updates
విశాఖ శారదా పీఠానికి సీఎం వైఎస్ జగన్
ముగిసిన సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన ముగిసింది. విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు. విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సంకల్పం చేయించారు. తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. వేద పండిత సభలో ఆయన పాల్గొన్నారు. విశాఖ శ్రీశారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు సీఎం.. ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి గన్నవరం బయల్దేరారు.
విశాఖ శారదా పీఠానికి సీఎం వైఎస్ జగన్
వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు అందజేసిన సీఎం జగన్
విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు.
రాజశ్యామలాదేవి యాగంలో పాల్గొన్న సీఎం జగన్
శ్రీ శారదా పీఠంలో మూడో రోజు కొనసాగుతున్న రాజశ్యామలాదేవి యాగంలో పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి... ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.
విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సంకల్పం చేయించారు. తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. అనంతరం వేద పండిత సభలో ఆయన పాల్గొన్నారు.
రాజశ్యామలాదేవి యాగంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్.. ధర్మాన కృష్ణదాస్... టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ పాల్గొన్నారు.
శారదా పీఠానికి చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శారదా పీఠానికి చేరుకున్నారు.
దేశ రక్షణ కోసం 5రోజుల పాటు రాజశ్యామల యాగం
ఏటా మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకు శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం 5 రోజుల పాటు శ్రీ శారదా పీఠం.. రాజ్యశ్యామల అమ్మవారి యాగం నిర్వహిస్తోంది.
విశాఖ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనేందుకు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. కాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా సీఎం జగన్ శ్రీ శారదా పీఠం చేరుకోనున్నారు. రాజ్యశ్యామలాదేవి పూజలో సీఎం జగన్ పాల్గొననున్నారు. శారదా పీఠంలో ఏర్పాటు చేసిన పండిత సభలో సీఎం పాల్గొంటారు.
విశాఖ బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయల్దేరారు.
మూడో రోజు రాజశ్యామలాదేవి యాగం
శ్రీ శారదా పీఠంలో మూడో రోజు రాజశ్యామలాదేవి యాగం కొనసాగుతోంది. రుత్వికులు లక్ష సార్లు అమ్మవారి నామార్చన చేస్తున్నారు.
వనదేవత.. రాజ శ్యామల దేవి అమ్మవార్లకు పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు చేశారు. చతుర్వేద పారాయణం మధ్య హోమం కొనసాగుతోంది.
నేడు విశాఖ శారదా పీఠానికి సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం బయల్దేరుతారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి శ్రీ శారదా పీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీ శారదా పీఠంలోని పలు కార్యక్రమల్లో పాల్గొంటారు.
వేద విద్యార్థులకు సీఎం జగన్.. ఉత్తీర్ణత పత్రాలు అందజేస్తారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు. పీఠం వార్షికోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననుండటం వరుసగా ఇది మూడోసారి.
Related News By Category
Related News By Tags
-
ఏడు కెమెరాలు, ఏడుగురు డైరెక్టర్లతో.. బాబు డ్రామా పీక్స్: కేకే రాజు ఫైర్
సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఇళ్ల క్రమబద్ధీకరణ విషయంలో చంద్ర...
-
‘టీడీపీ భిక్షగా ఇచ్చే సీట్లకే పరిమితం కాబోతున్నామా’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహా నగర ఎన్నికల నగారా మోగకముందే జనసేన శిబిరంలో నైరాశ్యం అలుముకుంది. విశాఖ రాజకీయాల్లో తమదే పైచే యి కావాలని.. పెరిగిన వార్డుల్లో సత్తా చాటాలని ఉవి్వళ్లూరుతున్న స్థానిక నేతల ఆశ...
-
‘ఆగు నాయనా.. వచ్చే ఏడాది నీకోసం పెద్ద బావి తవ్విస్తా’
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో వాగ్దానాలు సహజమే. కానీ, జనం గొంతెండుతుంటే ’భవిష్యత్తులో సముద్రాన్నే తీసుకొస్తా’ అంటూ గ్రాఫిక్స్ చూపించడం బహుశా చంద్రబాబుకే చెల్లుతుందేమో! సమస్యను ప్రపంచం మీదకు నెట్టేయ...
-
శు‘భ్రమే’.. అది సిత్రమే!
ముఖ్యమంత్రి చంద్రబాబు తన నటనాచాతుర్యంతో అందరినీ విస్మయపరిచారు. విశాఖ సముద్రతీరం వేదికగా.. ఏడు హై ఎండ్ కెమెరాలు, ఓ డ్రోన్ కెమెరా సాక్షిగా శనివారం హంగామా చేశారు. సామాన్యులను అనుమతించకుండా చిత్రీకరించి...
-
ఏపీకి చల్లటి శుభవార్త.. అల్పపీడనంతో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల...


