దళితులపై వివక్ష చూపినందుకే టీడీపీకి చావుదెబ్బ

బహుజన పరిరక్షణ సమితి నాయకులు
తాడికొండ: రాజధాని ప్రాంతంలో దళితులు, పేద వర్గాలపై వివక్ష చూపిన కారణంగానే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ కొట్టారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం 52వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అమరావతి ఉద్యమాన్ని భూతద్దంలో చూపిస్తున్నారన్నారు. కోర్టుల్లో వేసిన తప్పుడు కేసులు ఉపసంహరించుకుని.. ఇకనైనా బుద్ధి మార్చుకుని మూడు రాజధానులకు మద్దతు ఇవ్వకపోతే దళితులు, బహుజనులు సంఘటితమై చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరించారు. వివిధ సంఘాల నాయకులు చెట్టే రాజు, పరిశపోగు శ్రీనివాసరావు, జేటీ రామారావు, నూతక్కి జోషి, కొలకలూరి లోకేష్, పులి దాసు, నత్తా యోనరాజు, బేతపూడి సాంబయ్య, ఆదాం పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి