మదనపల్లి: లేడీ డాన్‌ సులోచన అరెస్ట్‌! | Lady Don Koneti Sulochana Arrested Madanapalle Police | Sakshi
Sakshi News home page

మదనపల్లి: లేడీ డాన్‌ సులోచన అరెస్ట్‌!

Oct 15 2026 7:03 PM | Updated on Oct 15 2026 7:06 PM

Lady Don Koneti Sulochana Arrested Madanapalle Police

సాక్షి, అన్నమయ్య జిల్లా: లేడీ డాన్‌ కోనేటి సులోచనను మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి నీరుగట్టుపల్లికి చెందిన కోనేటి సులోచన.. భూ కబ్జాలు, అమాయకులను మోసం చేసిన కేసుల్లో నిందితురాలిగా ఉంది. 14 కేసుల్లో నిందితురాలిగా ఉన్న సులోచనపై గతంలోనే రౌడీషీట్‌ ఉంది.

సులోచనపై 14 చీటింగ్‌ కేసులతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ ప్రసాద్‌ ఆదేశాలతో వన్ టౌన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఏయ్‌.. ఎవరనుకున్నావ్‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement