టీవీ5, ఏబీఎన్‌ యజమానులు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి: గోరంట్ల మాధవ్‌

Kuruva Gorantla Madhav Clarifies Morphing Social Media Video - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మార్ఫింగ్‌ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయ కుట్ర. కొంత మంది దుర్మార్గులు చేసి పని ఇది. ఇది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని ఆరోజే చెప్పాను. 

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, ఏబీఎన్‌, టీవీ-5 కుట్ర చేశారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఓ ‍బ్రోకర్‌. నూటికి నూరు శాతం ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. మీ చరిత్ర హీనమైంది. చంద్రబాబు నీకు కళ్లు కనపడటం లేదా?. ఇకనైనా నీ నీచ రాజకీయాలు మానుకో. ఇలాంటి నీచమైన చర్యలతో నీ పార్టీ బతకదు. తెలుగుదేశం పార్టీ నికృష్టపు ఆలోచనలు చేస్తోంది. 

నేను కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానని తెలుసు. ఫేక్‌ వీడియో సృష్టించి నన్ను అవమానించాలని చూశారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తాను. టీడీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ్యతిరేక పార్టీ. వెనుకబడిన వర్గాలు ఎదిగితే ఓర్వలేని పార్టీ అది. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు. నాకు మద్దతు తెలిపిన వారందరకీ కృతజ్ఞతలు. ఇక ఈ రాద్దాంతానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఏదో జరిగిపోతోందని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారు. అయ్యన్న పాత్రుడు విషం చిమ్మాలని చూశారు. వీడియో​ వెనుక ఉన్నవారెవరో పోలీసులు తేల్చాలి. ఏబీఎన్‌, టీవీ5 టీడీపీని ఎంతగా లేపాలని చూసినా ఆ పార్టీ లేవదు. టీడీపీ నేతలకు కనీసం నైతిక విలువలు కూడా లేవు. టీవీ5, ఏబీఎన్‌ యజమానులు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. అరగుండు అయ్యన్నపాత్రుడి కుమారుడు నాపై విషం చల్లారు అని మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్‌.. మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్‌ చేసి ఉండొచ్చు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top