వంటింటి వైద్యంతో కరోనా ‘ఆవిరి’

Kitchen tips working as medicines for Corona control - Sakshi

ఆవిరి పట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు

లక్షణాల్లేని పాజిటివ్‌ బాధితులు 3 రోజుల్లో సాధారణ స్థితికి      

లక్షణాలున్న వారు వారంలో కోలుకున్నారు. 

ముంబయి సెవెన్‌ హిల్స్‌ వైద్యుల పరిశోధన

సాక్షి, అమరావతి: వంటింటి చిట్కాలే కరోనా నియంత్రణకు ఔషధాలుగా పనిచేస్తున్నాయి. చివరకు అంతిమ నిర్ణయంగా చెప్పుకొనే వైద్యశాస్త్రం కూడా దీనివైపే మొగ్గుచూపడం గమనార్హం. కరోనా వైరస్‌ నియంత్రణకు తాజాగా ఆవిరి చికిత్స (స్టీమ్‌ థెరపీ) ప్రధాన ఔషధంగా ఉపయోగపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి వైద్యులు 3 నెలలుగా పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ఆస్పత్రికి చెందిన డా.దిలీప్‌పవార్‌ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ వివరాలు..

► పలువురు కోవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్లపై స్టీమ్‌ థెరపీ ప్రయోగం.
► అసింప్టమాటిక్‌ (ఎలాంటి లక్షణాల్లేని) పాజిటివ్‌ బాధితులు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల త్వరితగతిన కోలుకున్నారు.
► సాధారణంగా ఇది హోం రెమిడీ (ఇంటి చిట్కా) అయినా కోవిడ్‌ సమయంలో బాగా ఉపయోగపడుతోంది.
► పరిశోధనలో 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. 
► మొదటి గ్రూపులోని లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి చికిత్స చేయగా మూడు రోజుల్లోనే కోలుకున్నారు.
► అదే లక్షణాలుండి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారంలో సాధారణ స్థితికొచ్చారు. 
► కొన్ని రకాల క్యాప్సూల్స్, విక్స్, అల్లం ఇలా కొన్నింటితో ఆవిరి చికిత్స చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top