అన్నమయ్య జిల్లా: మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడింది. మహిళలను విశాఖ నుండి మదనపల్లికి తీసుకొచ్చి కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలన రేపుతోంది. యమున అనే మహిళ మిస్సింగ్ కేసు ఎపిసోడ్‌తో కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఆమె భర్త మధుబాబు 112 తిరుపతికి కాల్ చేయగా, మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు గుర్తించి ఫోటోలు పోలీస్ స్టేషన్‌కు ఎండార్స్ చేశారు పోలీసులు.
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్‌ను ట్రేస్ చేశారు పోలీసులు. దాంతో గ్లోబల్ హాస్పిటల్‌లో పద్మ కిడ్నీలను తొలగించే సమయంలో ఆమె మృతి చెందిన విషయం బయటపడింది. మరొకవైపు యమునతో పాటు తీసుకొచ్చిన మరో మహిళ ఆచూకీ కోసం పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కిడ్నీ రాకెట్ ఉదంతంపై మదనపల్లి 2 టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


