
కుర్డుంగ్లా కనుమపై నవరత్నాల పోస్టర్‌ను ప్రదర్శిస్తున్న యువకులు
అనంతపురం: ప్రపంచంలోనే ఎత్తైన రహదారిగా ఖ్యాతి గాంచిన కుర్డుంగ్లా కనుమపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పోస్టర్ రెపరెపలాడింది. అనంతపురంలోని గుల్జార్‌పేటకు చెందిన షేక్ దావూద్ రహమాన్, అతని మిత్రులు నాలుగు ద్విచక్ర వాహనాల్లో 3,600 కి.మీటర్ల దూరం ప్రయాణించి మంగళవారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో 5,359 మీటర్ల ఎత్తైన కుర్డుంగ్లా మార్గంలో నవరత్నాల పోస్టర్‌ను ప్రదర్శించారు. జిల్లా వాసులు సాధించిన ఈ ఘనతపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.