గోల్డెన్‌ ఫిష్‌ @ రూ.2.60 లక్షలు

Kachidi male fish weighing 21 kg cost above 2 lakhs - Sakshi

సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా పల్లిపాలెం చేపల మార్కెట్‌కు శనివారం 21 కేజీల బరువుగల కచిడి మగ చేప వచ్చింది. దీన్ని బంగారు చేపగా కూడా పిలుస్తారు. స్థానిక పాటదారుడు దీన్ని రూ.2.60 లక్షలకు చేజిక్కించుకున్నాడు. కచిడి రకం చేపల్లో ఆడ చేప కంటే మగ చేపకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. చేప పొట్ట భాగంలోని గాల్‌బ్లాడర్‌ను బలానికి వాడే మందుల తయారీలో వినియోగిస్తుంటారు. సర్జికల్‌ సమయాల్లో కుట్లు వేసే దారాన్ని తయారు చేయడంలో కూడా దీని గాల్‌బ్లాడర్‌ను వాడుతుంటారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top