
జస్టిస్ తుహిన్‌కుమార్‌తో ప్రమాణం చేయిస్తున్న హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్‌కుమార్ గేదెల ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో తుహిన్‌కుమార్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.
కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు జస్టిస్ తుహిన్‌కుమార్ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం ఆయన మరో న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కలిసి ధర్మాసనంలో కేసులను విచారించారు. జస్టిస్ తుహిన్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.