
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో అల్లర్లు సృష్టించాలని టీడీపీ యత్నిస్తోందని ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ మాత్రం రాష్ట్ర పరువు తీయడానికి యత్నిస్తోందన్నారు.
2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) సీఎండీ రజనీష్‌లను కలిసి పలు అంశాలపై చర్చించామన్నారు. దళితులకు ఉపకరించే ప్రధానమంత్రి అనుశ్చిత్ జాతి అభ్యుదయ్ (పీఎం–అజయ్) పథకం గురించి సుబ్రహ్మణ్యం వివరించారని, ఆ దిశగా ఏపీలో దళితుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.