తగ్గుతున్న నిరుద్యోగిత: : సీఎంఐఈ నివేదిక

Jobs In Record Levels In January 2021 - Sakshi

2021 జనవరిలో రికార్డుస్థాయిలో ఉద్యోగాలు

పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ..

తగ్గుతున్న నిరుద్యోగిత

సీఎంఐఈ నివేదిక వెల్లడి 

సాక్షి, అమరావతి: కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటూ ఉండటం ఉద్యోగ అవకాశాలపై సానుకూల ప్రభావం చూపిస్తోంది. ఉద్యోగాల కల్పనలో కొత్త ఏడాది 2021 సానుకూలంగా ప్రారంభమైందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. 2021 జనవరిలో దేశంలో నిరుద్యోగిత 6.5 శాతానికి తగ్గిందని ఆ నివేదిక తెలిపింది. లాక్‌డౌన్‌ తరువాత నిరుద్యోగిత ఇంతగా తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.

సీఎంఐఈ నివేదికలోని ప్రధానాంశాలు..
♦ 2020 డిసెంబర్‌లో దేశంలో నిరుద్యోగిత రికార్డుస్థాయిలో 9.1 శాతంగా ఉండగా, 2021 జనవరిలో నిరుద్యోగిత 6.5 శాతానికి తగ్గింది.
♦ 2021 జనవరిలో దేశంలో కొత్తగా 37.9 శాతం ఉద్యోగాలు లభించాయి.
♦ 2020 డిసెంబరులో దేశంలో 38.80 కోట్ల మంది ఉద్యోగులుగా ఉండగా, 2021 జనవరిలో ఆ సంఖ్య 40.07 కోట్లకు పెరిగింది. లాక్‌డౌన్‌ తరువాత ఇంతగా ఉద్యోగాలు పెరగడం ఇదే ప్రథమం.

♦ దేశంలో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండి ఉద్యోగం లేనివారు 2019–20లో సగటున 3.3 కోట్లమంది ఉన్నారు. కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 2.8 కోట్లకు తగ్గింది.
♦ దేశంలో ఉద్యోగుల్లో అత్యధికులు పర్మినెంట్‌ ఉద్యోగాల్లో లేరు. వారి ఉద్యోగాలు దేశ ఆరి్థక పరిస్థితి, స్థానిక పరిస్థితులు, వ్యాపార కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది.

చదవండి:
నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ

జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top