రేపే ‘సాక్షి’ని మూసేయిస్తా | JC Prabhakar Reddy in a media conference | Sakshi
Sakshi News home page

రేపే ‘సాక్షి’ని మూసేయిస్తా

Published Fri, Jun 21 2024 5:27 AM | Last Updated on Fri, Jun 21 2024 5:27 AM

JC Prabhakar Reddy in a media conference

ఉదయం 10 గంటలకు మూతేయకపోతే చూడండ్రా..

నేను వస్తే పోలీసులు కూడా అడ్డుకోలేరు

మీ సీతారామాంజనేయులు,పేర్ని నాని, మా ఎమ్మెల్యే వస్తారా?

వాళ్లెవరూ రారు.. నేను ఎవరికీ భయపడను

మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి చిందులు

అనంతపురం క్రైం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి నోటికి పనిచెప్పారు. బుధవారం మీడియా సమక్షంలో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఆయన.. ఆ వార్తను ప్రచురించిన, ప్రసారం చేసిన ‘సాక్షి’ మీడియాపై గురువారం నోరుపారేసుకున్నారు. సాక్షి ఆఫీసుకు రేపు ఉదయం 10 గంటలకు  మూతేయకపోతే చూడండ్రా.. ఎవరూ అడ్డుకోలేరంటూ బెదిరించారు. 

గురువారం అనంతపురంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం పేరిట కొందరు పాత్రికేయులను పిలిపించి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. ‘వాళ్లని, వీళ్లని కాదు. మిమ్మల్నే (సాక్షి) బెదిరిస్తున్నా. ఏం పీకుతారు’ అంటూ బరితెగించి మాట్లాడారు. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లను కాదు.. నేరుగా మీకే చెబు­తున్నా.. సాక్షిని మూతేయిస్తా. నేను బంద్‌ చేయించేందుకు వస్తే పోలీసులు కూడా అడ్డుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగారు. ‘మీ కార్యాలయంపై దాడి చేస్తే దిక్కొచ్చే వారెవరున్నారు? నోరు మూసుకుని ఉండాలి. దర్బేష్‌.. నా కొ.. ల్లారా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఊగిపోయారు. 

‘ఆయమ్మను బెదిరించాడు.. ఈయమ్మను బెదిరించాడు అన్నారు కదా.. ఇప్పుడు మిమ్మల్నే అంటున్నా.. మీకెవరు దిక్కున్నారు? మీ సీతారామాంజనేయులు, మీ పేర్ని నాని, మా ఎమ్మెల్యే (పెద్దారెడ్డి) వస్తారా? వాళ్లెవరూ రారు. నేను ఎవరికీ భయపడను. అంతకు ముందు కూడా నేను ‘సాక్షి’ ముందే కూర్చున్నా. మీకు వెనకాల, ముందు ఏముంది? నేను అనుకుంటే అనంతపురం సాక్షి ఆఫీసు మూసేయిస్తా’ అంటూ రెచ్చిపోయారు. 

‘వాన్నీ.. వీన్ని బెదిరించను. నేరుగా మిమ్మల్నే బెదిరిస్తున్నా. అప్పట్లో మాకు ఎవరూ ప్రొటెక్షన్‌ రాలేదు. ఈ రోజు మీపైకి వస్తే మీకు అండగా ఎవరూ రారు. మేమొస్తే ఎవడూ అడ్డుకోలేరు. లక్షలాది మంది జనం మీ కార్యాలయంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవడూ లేడు. నాకు జన బలం ఉంది’ అంటూ బెదిరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement