జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు | JC Diwakar Reddy Cadre breaks Covid guidelines | Sakshi
Sakshi News home page

జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు

Aug 6 2020 9:19 PM | Updated on Aug 6 2020 9:52 PM

JC Diwakar Reddy Cadre breaks Covid guidelines - Sakshi

సాక్షి, అనంతపురం : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గురువారం అత్యుత్సాహం చూపించారు. కడప కేంద్ర కారాగారం నుండి జేసీ, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు గురువారం విడుదలయ్యారు. అక్రమ వాహనాల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద జేసీ వర్గీయులు హంగామా చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా భారీ కాన్వాయ్‌తో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు కడప నుంచి తాడిపత్రి చేరుకున్నారు.  

తాడిపత్రికి వెళ్లే సమయంలో కడప బైపాస్‌లో భారీ కాన్వాయ్‌ కారణంగా 108 అంబులెన్సు వాహనం నిలిచిపోయింది. జేసీ అనుచరుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో ఇలాంటివి అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement