ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం | Janasena behind conspiracy to shut down theatre in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం

May 27 2025 4:15 PM | Updated on May 27 2025 5:29 PM

Janasena behind conspiracy to shut down theatre in Andhra pradesh

సాక్షి,విజయవాడ: ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం ఉన్నట్లు తేలింది. ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ (Kandula Durgesh) ప్రధాన అనుచరుడు, జనసేన నేత అత్తి సత్యనారాయణ బంద్ కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. పార్టీకి మరక అంటకుండా హడావిడిగా సత్యనారాయణపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది .

రాజమండ్రి సిటీ  జ‌న‌సేన ఇన్ ఛార్జ్‌గా ఉన్న సత్యనారాయణను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. బంద్ ప్రతిపాదన నిజమా..? అబద్ధమా..? తేలేవరకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ వేముల పాటి అజయ్ కుమార్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. 

‘హరి హర వీరమల్లు’ మూవీ విడుదల సమయంలో థియేటర్ల బంద్‌ విషయం తెరపైకి వచ్చింది.  దీంతో డిప్యూటీ సీఎం పవన్ సినీపెద్దలపై, థియేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ అంశంలో ఆ నలుగురు పెద్దలను విచారించాలని మంత్రి దుర్గేష్ హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అయితే ఇప్పుడు ఆ కుట్ర చేసింది దుర్గేష్ అనుచరుడే అని నిర్ధారణయ్యింది. ఫలితంగా తాము ప్రజల్లో అభాసుపాలయ్యామంటూ జనసేన నేతల్లో కలవరం మొదలైంది.

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

Advertisement
 
Advertisement
Advertisement