
సాక్షి, విజయవాడ : భూగర్బజల వ్యవస్థలో సవాళ్లకి జాతీయ సదస్సు ద్వారా సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీ భూగర్బ జలాలు, జలగణనశాఖ స్వర్ణోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంది. ప్రతీ నీటిబొట్టుని వినియోగించండంపై దృష్టిసారించాలి. భవిష్యత్‌లో పెరగనున్న నీటి అవసరాలని దృష్టిలో పెట్టుకుని భూగర్బజలాల సంరక్షణ ఉండాలి’’ అన్నారు మంత్రి అనిల్.
‘‘రాష్ట్రంలో భూగర్బ జలాల లభ్యత... వినియోగంపై శాస్త్రవేత్తలు ఎప్పటికపుడు చేస్తున్న పరిశోధనలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు కొరత లేకుండా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలపై దృష్టి సారించారు. వైఎస్సార్ జలకళ ద్వారా రైతులకి ఉచితంగా బోర్లు తవ్వే పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాయలసీమలోనూ సాగు, తాగు నీటి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాం’’ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
చదవండి: ‘ఆ దిక్కుమాలిన గ్రంథం మా దగ్గర లేదు’