స్వాతంత్ర పోరాటం మహోన్నతం.. ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధన: ఏపీ సీఎం జగన్‌

Independence Day 2022: AP CM YS Jagan Unfurls The Tricolour Flag  - Sakshi

సాక్షి, విజయవాడ: స్వాతంత్ర దినోత్సవ సంబురాలు దేశం మొత్తం అట్టహాసంగా సాగుతున్నాయి. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. 

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. సోమవారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం జగన్‌. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శకటాల ప్రదర్శనను వీక్షించి.. ప్రసంగించారు.

సీఎం జగన్‌ ప్రసంగం

స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక.  సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం గమ్యంగా పోరాడారు ఆనాటి యోధులు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిన అవసరం ఉంది. 

అహింసే ఆయుధంగా, సత్యయే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం.. ప్రపంచ మానవాళికి మోహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుంది. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని కొనియాడారు సీఎం జగన్‌. రైతన్నలకు సెల్యూట్‌. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్‌ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్‌ లిస్ట్‌లో కొనసాగుతోందని గుర్తుచేశారు సీఎం జగన్‌.  ఇక ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై సీఎం జగన్‌ మాట్లాడారు.

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • మూడేళ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగాం
  • అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చాం
  • పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చాం
  • ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటివద్దకే పింఛన్‌ ఇస్తున్నాం
  • విత్తనం కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకూ ఆర్‌బీకేల ద్వారా సేవలు
  • అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా అందిస్తున్నాం
  • రైతు సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం
  • ప్రతి మండలానికి రెండు పీహెచ్‌పీలు తీసుకొచ్చాం
  • అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించాం
  • ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నాం
  • సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశాం
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ  వర్గాలకు పెద్ద పీట వేశాం
  • నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశాం
  • మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రభుత్వం మనది
  • ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరం
  • పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top